ఇన్వెస్టర్ల ముందుకు ఈ వారం 3 ఐపీఓలు

ఇన్వెస్టర్ల ముందుకు ఈ వారం 3 ఐపీఓలు

న్యూఢిల్లీ: ఐపీఓ మార్కెట్ ఈ వారం కూడా సందడి చేయబోతోంది.  మూడు కంపెనీలు ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి.  బ్లాక్‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌కు వాటాలు ఉన్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌, హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ టెక్ కంపెనీ ఇండెజీన్‌‌‌‌‌‌‌‌, ట్రావెల్‌‌‌‌‌‌‌‌ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టీబీఓ టెక్‌‌‌‌‌‌‌‌  కలిసి సుమారు రూ.6,400 కోట్లను సేకరించాలని చూస్తున్నాయి.  2004 తర్వాత జనరల్ ఎలక్షన్స్ టైమ్‌‌‌‌‌‌‌‌లో అంటే మే నెలలో ఒక్క ఐపీఓ కూడా రాలేదు. ఈసారి మూడు మెయిన్ బోర్డ్ ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు వస్తుండడం విశేషం. ఇండెజీన్ ఐపీఓ ఈ నెల 6న ఓపెన్ కానుంది. 8న ముగుస్తుంది. 

 ఒక్కో షేరును రూ.430–452 ప్రైస్ రేంజ్‌‌‌‌‌‌‌‌లో కంపెనీ అమ్ముతోంది. మూడు రోజుల పాటు అందుబాటులో ఉండే  ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌, టీబీఓ టెక్  ఐపీఓలు  మే 8న ఓపెన్ కానున్నాయి. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ  పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 3 వేల కోట్లన సేకరించాలని చూస్తోంది. కంపెనీ షేర్లు  రూ.300–315 రేంజ్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంటాయి. టీబీఓ టెక్‌‌‌‌‌‌‌‌ షేర్లు రూ.875–920 రేంజ్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంటాయి. ఈ కంపెనీ సుమారు రూ.1,551 కోట్లను సేకరించాలని ప్లాన్ చేస్తోంది.