వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి అంతా రెడీ

వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి అంతా రెడీ

బీజింగ్ వేదికగా వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి అంతా రెడీ అయ్యింది. ప్రఖ్యాత బీజింగ్ నేషనల్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు జరుగనున్నాయి. వారం రోజులపాటు జరగనున్న ఈ గేమ్స్ లో 90 దేశాల నుంచి సుమారు మూడు వేల మంది అథ్లెట్లు పోటీపడబోతున్నారు. ఏడు క్రీడాంశాల్లో మొత్తం 109 విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో డ్రాగన్  సర్కార్ విదేశీ  ప్రేక్షక్షులకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పటికే కర్లింగ్, లూజ్, స్కై జంపింగ్ , అల్పైన్  స్కీయింగ్ , ఫ్రీస్టయిల్  స్కీయింగ్ , ఐస్  హాకీ, స్కై జంపింగ్  విభాగాల్లో పోటీలు మొదలుకాగా....శనివారం పతకాల ఈవెంట్లు ఆరంభం కాబోతున్నాయి.

ఈ వేడుకల్లో భారత్ నుంచి ఒకే ఒక్క అథ్లెట్ పాల్గొంటున్నాడు. జమ్ము కశ్మీర్ కు చెందిన ఆరిఫ్ ఖాన్ స్కీయింగ్ లో పోటీపడుతున్నాడు. స్లాలోమ్, జెయింట్ స్లాలోమ్  విభాగాల్లో ఆరిఫ్  బరిలోకి దిగనున్నాడు. వింటర్  ఒలింపిక్స్ లో భారత్  1964 నుంచి పాల్గొంటున్నది. అయితే 2002 తర్వాత దేశం నుంచి ఒక్కరే పాల్గొనడం ఇదే మొదటిసారి. ఒలింపిక్స్ కు బీజింగ్  ఆతిథ్యం ఇవ్వడం 14 ఏండ్లలో ఇది రెండోసారి. 2008లో సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి.  వింటర్  ఒలింపిక్స్  ప్రారంభ, ముగింపు వేడుకలను బహిష్కరించింది భారత్. ఒలింపిక్స్ టార్చ్ బేరర్ గా గల్వాన్  ఘటనతో ప్రమేయం ఉన్న ఆర్మీ అధికారిని చైనా ఎంపిక చేయడంతో భారత్  ఈ నిర్ణయం తీసుకుంది.