సమతా పార్టీ లీడర్ జయా జైట్లీకి నాలుగేళ్ల జైలు

సమతా పార్టీ లీడర్ జయా జైట్లీకి నాలుగేళ్ల జైలు

న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణల కేసులో సమతా పార్టీ మాజీ ప్రెసిడెంట్ జయా జైట్లీ, మరోఇద్దరికి నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. కోర్టు వీరికి రూ.లక్ష చొప్పున ఫైన్ కూడా వేసింది. 2000–01లో జరిగిన డిఫెన్స్ డీల్ లో అవినీతి జరిగినట్లు రుజువు కావడంతో సీబీఐ స్పెషల్ జడ్జి వీరేందర్ భట్ తీర్పునిచ్చారు. జయా జైట్లీ, సమతా పార్టీ నేత గోపాల్ పచేర్వాల్, రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్పీ ముర్గయి గురువారం సాయంత్రం 5గంటల్లోగా లొంగిపోవాలని ఆదేశించారు. ఆర్మీకి థర్మల్ ఇమేజర్స్ ను సప్లై చేసేందుకు వెస్టెండ్ ఇంటర్నేషనల్ కంపెనీకి డీల్ కుదిర్చినందుకు గాను కంపెనీ నుంచి జయా జైట్లీ రూ.2 లక్షలు, ముర్గయి రూ.20 వేలు లంచం తీసుకున్నారు. ఇది మీడియా స్టింగ్ ఆపరేషన్ లో బయటపడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం..