కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్

కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది :  కేసీఆర్

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదని విమర్శించారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.  ప్రతి జిల్లాలకు నవోదయ పాఠశాల, మెడికల్ కాలేజీ ఇవ్వాలని ప్రధానిని  కోరితే ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిస్తే  తెలంగాణకు ఒక్క పైసా కూడా తేలేదన్నారు. కరీంనగర్ లో జరిగిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు.  

కరీంనగర్  ఎంపీగా గెలిచిన బండి సంజయ్ జిల్లాకు పైసా పని కాలేదన్నారు కేసీఆర్.ఆయనకు భాష రాదని..  పార్లమెంట్ లో మాట్లాడితే అక్కడ ఎవరికీ అర్థం కానీ పరిస్థితి ఉందని విమర్శించారు.  జిల్లా్కు స్మార్ట్ తెచ్చిన  వినోద్ కుమార్ ను పార్లమెంట్ కు పంపాలని కోరారు. తనకున్న సర్వే ప్రకారం వినోద్ కుమార్ గెలుపు ఖాయం అయిందని..  8 శాతంతో ముందు వరుసలో ఉన్నారని కేసీఆర్ తెలిపారు.  

కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి నోటికొచ్చిన హామీలతో గద్దెనెక్కిందని విమర్శించారు కేసీఆర్.  అనేక రకాలుగా మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు.  రాష్ట్రంలో రైతుల మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు కేసీఆర్. గ్రామాల్లో కి మళ్ళీ బోర్లు వస్తున్నాయని చెప్పారు.  కాళేశ్వరం ఏదో అయిందని చెప్పి రైతుల నోట్లో మట్టి కొట్టారన్నారు. సాగు తాగు నీటిని అవస్థలు చూసి తనకు బాధగా ఉందన్నారు.