టీ20 వరల్డ్ కప్ 2026 లో భాగంగా పాకిస్తాన్, నెదర్లాండ్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. కొలంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది పాకిస్తాన్. మొదట బ్యాటింగ్ కి దిగిన పసికూన నెదర్లాండ్స్ ఆరంభంలోనే తడబడింది. మొదటి నాలుగు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది నెదర్లాండ్స్. ఆ తర్వాత కాస్త కోలుకున్నప్పటికీ..చివరి వరకు నిలబడలేకపోయారు నెదర్లాండ్స్ బ్యాటర్లు.19.5 ఓవర్లకు 147 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు నెదర్లాండ్స్ ఆటగాళ్లు.
పాక్ బౌలర్ల ధాటికి ఏమాత్రం నిలబడలేకపోయారు నెదర్లాండ్స్ బ్యాటర్లు. నెదర్లాండ్స్ బ్యాటర్లలో కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ ( 29 బంతుల్లో 37 రన్స్ ) బాస్ డీ లీ ( 25 బంతుల్లో 30 రన్స్ ) మినహా ఎవరూ మెప్పించలేకపోయారు. పాక్ బౌలర్లు సల్మాన్ మీర్జా 3 వికెట్లు, సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్, మహమ్మద్ నవాజ్, చెరో 2 వికెట్లు పడగొట్టారు.
►ALSO READ | ఈ హింస దారుణం..వైభవ్ సూర్యవంశీని అరెస్ట్ చేయాలి...ట్వీట్ వైరల్
పాకిస్తాన్ కి ఈ మ్యాచ్ చాలా కీలకమైన క్రమంలో 148 పరుగుల టార్గెట్ చేజ్ చేయడం చాలా ఈజీ అనే చెప్పాలి. పాక్ ఓపెనర్లు మంచి బిగినింగ్ ఇస్తే.. ఈ మ్యాచ్ విన్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పచ్చు.ఇండియాతో జరగాల్సిన మ్యాచ్ బాయికాట్ చేసిన క్రమంలో పాకిస్తాన్ సూపర్ 8 కి వెళ్లాలంటే మూడు మ్యాచ్ లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. నెదర్లాండ్స్ పై భారీ విక్టరీ సాధించి సూపర్ 8 అవకాశాలను మెరుగుపర్చుకోవాలని ఆశిస్తోంది పాక్.
