అప్పుడు గుర్రాలు కదా : సమాధుల తవ్వకాల్లో 2 వేల 500 ఏళ్ల నాటి హెల్మెట్ దొరికింది..!

అప్పుడు గుర్రాలు కదా : సమాధుల తవ్వకాల్లో 2 వేల 500 ఏళ్ల నాటి హెల్మెట్ దొరికింది..!

ఎవ్వరికీ తెలియని ఎన్నో విషయాలు భూమిపై చాలానే ఉన్నాయి. వాటి కోసం పురావస్తు శాఖ అధికారులు ప్రపంచవ్యాప్తంగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా చాలా వింతలూ-విశేషాలూ రహస్యంగానే మిగిలిపోయాయి. ఇదిలా ఉంటే.. తాజాగా క్రొయేషియాలో ఒక సమాధి త్రవ్వకాలలో, పురావస్తు శాస్త్రవేత్తలు 2500 సంవత్సరాల నాటి హెల్మెట్‌ను  వెలికితీశారు.ఇది ఆదేశాన్ని పాలించిన రాజు కాని..  ఉన్నత స్థాయి వ్యక్తిది అయి ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.... 

 క్రొయేషియాలో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక సమాధిని తవ్వుతున్నారు.  అప్పుడు అక్కడ ఒక పాత హెల్మెట్​ చూసి ఆశ్చర్యపోయారు.  ఈ  పాత హెల్మెట్​ వేరే లోహంతో తయారు చేసినట్లు గుర్తించారు.  ఇంతకు ముందు కూడా ఇటలీలో గ్రీకు నాగరికతకు చెందిన రెండు హెల్మెట్లను, గోడను కనుగొన్నారు.జాగ్రెబ్ విశ్వవిద్యాలయానికి చెందిన  ఓ బృందం గోమైల్ పురావస్తు ప్రదేశంలో ఒక సమాధిని తవ్వుతోంది. అప్పుడు బయట పడిన అవశేషాల్లో  ఒక వింత వస్తువును గుర్తించారు.  ఆ బృందం దానిని పూర్తిగా పరిశీలించిన తరువాత దానిని హెల్మెట్ ( శిరస్త్రాణం)గా గుర్తించారు.  అయితే ఇది  క్రీస్తు  పూర్వం నాల్గవ‌‌‌‌‌‌ .... ఆరవ శతాబ్దాల మధ్య కాలం నాటితనా  హల్మెట్​ గా గుర్తించారు. అంటే ఈ హెల్మెట్​ 2500 ఏళ్ల సంవత్సరాల నాటిదని పరిశోధనా బృందం తెలిపింది. 

.జాగ్రెబ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు జరిపిన పురావస్తు తవకాల్లో బయటపడిన హెల్మెట్​... యుద్దాలు జరిగేటప్పుడు  ఆ హెల్మెట్​ శత్రువుల మానసిక ప్రభావం చూపే విధంగా ఉందని పురావస్తు మ్యూజియం డైరెక్టర్ డొమాగోజ్ పెర్సిక్ తెలిపారు. ఈ హెల్మెట్​ చాలా స్ట్రాంగ్​ గా ఉందని దీనిలో నుంచి మారణాయుధాలు దూసుకుపోలేవన్నారు. శత్రువులతో పోరాడేటప్పుడు తలపై ఉంటే .. ప్రత్యర్థుల్లో భయం కలిగేలా ఉండే విధంగా ఉందన్నారు. 

 క్రొయేషియా గోమైల్ ప్రదేశంలోని ప్రతి సమాధిలో  ప్రతి సమాధిలో అనేక మృతదేహాలు ఖననం చేయబడ్డాయని జాగ్రెబ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్​  హ్ర్వోజే పోట్రేబికా  తెలిపారు.  ఈ హెల్మెట్​ వాడుకలో ఉన్న సమయంలో ఇక్కడి నాగరికత అభివృద్ది చెందినట్లు గుర్తించారు.  ఈ ప్రాంతంలో నివసించిన వారికి గ్రీకులు అంటే ఇల్లిరియన్స్ అంటారని ప్రాచీన గ్రీకు పత్రాల ద్వారా తెలుస్తుందన్నారు.  ఇల్లిరియన్లు అనేక తెగలుగా ఏర్పడటంతో చాలా రాజ్యాలు ఆవిర్భవించాయని పోట్రేబికా అన్నారు.  తరువాత బీపీ 229 మరియు 168 బీసీ మధ్య కాలంలో రోమన్​ పాలకులు ఇల్లిరియన్స్​ రాజ్యాలను ఆక్రమించి స్వాధీనం చేసుకున్నారని చరిత్ర ద్వారా తెలుస్తోంది.  2500 ఏళ్ల నాటి హెల్మెట్​ చెక్కు చెదరలేదని ప్రాఫెసర్​ పోట్రేబికా తెలిపారు.  దీని పై భాగం రాతితో తయారు చేశారు.  అయితే ఇది సమాధులకు ఉపయోగించే రాళ్లకు భిన్నంగా ఉంది.  ఆరోజుల్లో ఎవరైనా చనిపోయినప్పుడు.. అతను వాడిన హెల్మెట్​ను పాతిపెట్టు సంప్రదాయం ఉండేదని దీనినిన బట్టి అర్దమవుతుందని పోట్రేబికా  తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.