రూ.20 వేలకు మించి క్యాష్ లోన్‌​ ఇవ్వొద్దు

రూ.20 వేలకు మించి క్యాష్ లోన్‌​ ఇవ్వొద్దు
  • ఎన్​బీఎఫ్​సీలకు ఆర్​బీఐ వార్నింగ్‌ 

న్యూఢిల్లీ: లిమిట్‌‌ (రూ.20 వేల)  కంటే ఎక్కువ  లోన్‌‌ను క్యాష్​ రూపంలో  ఇస్తున్న కొన్ని నాన్‌‌ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్‌‌బీఎఫ్‌‌సీ) పై రిజర్వ్‌‌ బ్యాంక్ (ఆర్‌‌‌‌బీఐ) సీరియస్ అయ్యింది. ‘ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్‌‌ 1961 చట్టంలోని సెక్షన్‌‌ 269ఎస్‌‌ఎస్‌‌ ప్రొవిజన్ ప్రకారం, ఏ వ్యక్తి కూడా రూ.20 వేల కంటే ఎక్కువ లోన్‌‌ను క్యాష్​ రూపంలో స్వీకరించకూడదు. అదే విధంగా ఏ ఎన్‌‌బీఎఫ్‌‌సీ కూడా రూ.20 వేల కంటే ఎక్కువ అమౌంట్‌‌ను క్యాష్ రూపంలో లోన్‌‌ను డిస్‌‌బర్స్ చేయకూడదు’ అని ఆర్‌‌‌‌బీఐ బుధవారం పేర్కొంది.

క్యాష్ లోన్ డిస్‌‌బర్సల్స్‌‌ (పంపిణీ)  రూల్స్‌‌ను ఉల్లంఘించినందుకు ఐఐఎఫ్‌‌ఎల్‌‌ ఫైనాన్స్‌‌పై ఆర్‌‌‌‌బీఐ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.  చాలా వరకు  గోల్డ్ లోన్లను క్యాష్ రూపంలో కంపెనీలు ఇస్తున్నాయని రాయిటర్స్ పేర్కొంది. ఇన్‌‌కమ్ ట్యాక్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ నుంచి తప్పించుకునేందుకు కొన్ని ఎన్‌‌బీఎఫ్‌‌సీ కంపెనీలు ఈ ట్యాక్స్ రూల్‌‌ను ఉల్లంఘిస్తున్నాయని ఆర్​బీఐ ఆరోపించింది.