PBKS vs RCB: ఐపీఎల్‌లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్

PBKS vs RCB: ఐపీఎల్‌లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్

ఐపీఎల్ లో భాగంగా లీగ్ మ్యాచ్ లు చివరి దశకు వచ్చేశాయి. ముంబై ప్లే ఆఫ్ రేస్ నుంచి అధికారికంగా నిష్క్రమించగా.. మిగిలిన జట్లన్నీ  ప్లే ఆఫ్ రేస్ లో నిలిచాయి. ఈ నేపథ్యంలో నేడు (మే 9) మరో ఆసక్తికర సమరం జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. ఇరు జట్లు 11 మ్యాచ్ లాడి నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించాయి. ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. దీంతో ఈ మ్యాచ్ హోరా హోరీగా సాగే అవకాశముంది.

 
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :

టోర్నీ ప్రారంభంలో దారుణ ప్రదర్శనతో విమర్శలు మూట కట్టుకున్న ఆర్సీబీ.. సెకండ్ హాఫ్ లో అదరగొడుతుంది. మొదటి 8 మ్యాచ్ ల్లో ఒక విజయం మాత్రమే సాధించిన బెంగళూరు.. తర్వాత ఆడిన మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించి సూపర్ ఫామ్ లో ఉంది. బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. సిరాజ్ ఫామ్ లోకి రాగ.. యష్ దయాళ్, కరణ్ శర్మ బౌలింగ్ లో ఆకట్టుకుంటున్నారు. ఇక బ్యాటింగ్ లో కోహ్లీ, డుప్లెసిస్ మంచి ఆరంభాలు ఇస్తుంటే.. విల్ జాక్స్, పటిదార్ మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతున్నారు. మ్యాక్స్ వెల్ ఫామ్ లోకి వస్తే ఆర్సీబీకు తిరుగుండదు. 


పంజాబ్ కింగ్స్:

పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్, బౌలింగ్ లో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ నిలకడగా ఎవరూ రాణించలేకపోతున్నారు. శశాంక్ సింగ్ మినహాయిస్తే బ్యాటింగ్ లో అందరూ విఫమవుతున్నారు. బెయిర్ స్టో, రూసో లాంటి ఆటగాళ్లు గాడిలో పడితే పంజాబ్ కు తిరుగుండదు. మరోవైపు బౌలింగ్ లో పర్వాలేదనిపిస్తుంది. స్పిన్నర్ రాహుల్ చాహర్ ఫామ్ లోకి రావడం ఆ జట్టుకు కలిసి రానుంది. ఆర్ష దీప్ సింగ్, రబడా, సామ్ కరణ్ బౌలింగ్ లో మెరుగవ్వాల్సి ఉంది. మొత్తానికి డూ ఆర్ డై మ్యాచ్ లో ఎవరు విజయం సాధించి రేస్ లో ఉంటారో ఎవరు ఇంటిదారి పడతారో చూడాలి.