OMG : ఆ అడవి మొత్తం శవాలే.. గుట్టలుగా పడి ఉంటాయి.

OMG : ఆ అడవి మొత్తం శవాలే.. గుట్టలుగా పడి ఉంటాయి.

ప్రపంచంలో వందలాది దేశాలు.. వేలాది తెగల ప్రజలు ఉన్నారు. ఈ భూమిపై అనేక సంప్రదాయాలు, ఆచారాలను విశ్వసించే వ్యక్తులు ఉన్నారు. ఒక్కో మతంలో ఒక్కోరకమైన ఆచార వ్యవహరాలను పాటిస్తారు. ఐతే ఇందులో కొన్ని సంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇతరులతో పోల్చితే ఎంతో విభిన్నంగా ఉంటాయి. సాధారణంగా ఎవరైనా చనిపోతే.. సమాధుల్లో పూడ్చిపెడతారు. లేదంటే దహనం చేస్తారు. కానీ ఇండోనేసియా(Indonesia)లోని ఓ తెగ మాత్రం విచిత్ర సంప్రదాయాన్ని పాటిస్తోంది.

ఇండోనేషియాలోని ట్రూనియన్ గ్రామంలో విచిత్రమైన అంత్యక్రియల సంప్రదాయాన్ని ఆచరిస్తారు.. ఇక్కడ మృతదేహాలను ఖననం చేయడం ...  దహనం కాని చేయరు.  అయితే మృతదేహాలను కుళ్లి పోయే విధంగాఅడవిలో ఉంచుతారు.  అయితే వీటిని రాబందులు, కాకులు.. లాంటివి తినకుండా వెదురు కర్రలతో బోనులు తయారు చేసి కప్పి  ఉంచుతారు.   ఎందుకంటే ఈ మృత దేహాలను ఏ ప్రాణి అయినా తింటే చనిపోయిన వారికి అవమానం జరుగుతుందని నమ్ముతారు.

ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో ట్రూనియన్ అనే గ్రామం ఉంది. ఇక్కడ నివసించే ప్రజలను బలి అగా, బలియాగా లేదా బలి ములా బలి అని అంటారు.  పర్వతాల మధ్యన నివసించే ఈ తెగల వారు  ఆస్ట్రోనేషియన్లు  వారి ఆచారాలను తప్పకుండా పాటిస్తారు.  ఈ తెగ వారికి  ప్రత్యేకంగా నిబంధనలు.. చట్టాలు.. ఉంటాయి. అయితే వీరి అంతిమ సంస్కారాల ఆచారం చాలా ప్రత్యేకమైనది. పార్సీ ప్రజలు మృతదేహాలను జంతువులు మరియు పక్షులు తినడానికి వీలుగా వదిలేస్తారు.  వీరికి విరుద్దంగా బాలి అగా కమ్యూనిటీ ప్రజలు మృతదేహాలను కుళ్ళిపోవడానికి అడవిలో వదిలివేస్తారు, ట్రూనియన్ గ్రామానికి సమీపంలో మూడు స్మశానవాటికలు ఉన్నాయి.  వీటిలో ఒకదానిని పర్యటకుకు.. రెండవది సహజంగా మరణించిన వారి వ్యక్తుల మృతదేహాల కోసం.. మూడోదానిలో ప్రమాదంలో మనరణించినా.. లేదా ఆత్మహత్య చేసుకున్న వారి మృత దేహాలను ఇక్కడ ఉంచుతారు.  పిల్లలను కూడా ఇక్కడ ఉంచరు.  పెళ్లయిన వారి మృతదేహాలను మాత్రమే ఇక్కడ ఉంచుతారని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది.

సాధారణంగా శుభ కార్యక్రమాలు చేసేందుకు తిథి.. వార.. నక్షత్రాల.. చూస్తారు.  కాని బాలిఅగ తెగ వారు మృత దేహాలను అడవిలో వదిలేయడానికి మంచి రోజు చూస్తారట.  అంతిమ సంస్కారాలకు డబ్బులు సమకూర్చుకోవాలి.  శుభ దినాలలో మాత్రమే జరుగుతుంది. , కొన్నిసార్లు సంవత్సరాల తరబడి, కుటుంబానికి అంత్యక్రియలకు చెల్లించడానికి తగినంత డబ్బు వచ్చే వరకు. మరణ వేడుకను నిర్వహించే ముందు చనిపోయినవారి ఆత్మ ప్రపంచంలో నిలిచిపోతుందని నమ్ముతారు.

ఇండోనేషియాలోని ట్రూనియన్ గ్రామ స్థల పురాణం  ప్రకారం ... బాలి అగా ప్రజలు అగ్నిపర్వతం మండకుండా ఉండేందుకు   మృతదేహాలు కాపాడుతాయని అక్కడి ప్రజల విశ్వాసం. బాలిఅగా కుల దేవత  జ్వాలాముఖిని  బ్రహ్మగా  వారు భావిస్తారు.జ్వాలాముఖిని    ప్రసన్నం చేసుకునేందుకు శ్మశానవాటికలో పదకొండు తాటి, వెదురు బోనుల ఆకారంలో పదకొండు పగోడాలను నిర్మించారు.  ఈ గ్రామంలో ఒక దేవాలయం కూడా ఉంది. స్మశానవాటిక మృతదేహాలతో నిండినప్పుడు, పురాతన మృతదేహాల  అవశేషాలు నేలపై విసిరేస్తారు. ఒక వేళ స్థలం లేకపోతే  నెలల పాటు అంటే ఖాళీ స్థలం దొరికేంతవరకు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుంటారు,  మృతదేహాలు చెడిపోకుండా  ఉండేందుకు ఫార్మాల్డిహైడ్‌తో చుట్టి ఉంచుతారు.