ముంబై: విదేశీ మారక ద్రవ్య నిల్వల పొదుపునకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలి నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన గురువారం బైక్‌పై అసెంబ్లీకి చేరుకున్నారు.
బీజేపీ నేత, మంత్రి ఆశిష్ షెలార్ కూడా సీఎంతో కలిసి బైక్‌పై వెళ్లారు. మంత్రివర్గ సహచరుల కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను సగానికి తగ్గించడంతో పాటు, మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలను రద్దు చేస్తూ సీఎం ఫడ్నవీస్ పొదుపు చర్యలను ప్రకటించారు.
