కల్తీ ఐస్ క్రీమ్ ముఠా అరెస్ట్

కల్తీ ఐస్ క్రీమ్ ముఠా అరెస్ట్

కల్తీ కల్తీ.. ఎందులో చూసిన కల్తీ.. ఎక్కడ చూసిన కల్తీ.. పప్పులు, ఉప్పులు, నూనె, పసుపు వంటి అహార పదార్థాలను కొందరు కల్తీగాళ్లు కల్తీ చేస్తున్నారు. తాజాగా  పిల్లలు తినే తినుబండారాలను కూడా కల్తీగాళ్లు వదలడం లేదు. చిన్నపిల్లలు ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ కూడా కల్తీ జరుగుతుంది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జీడిమెట్ల, షాపూర్ లో కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. 

జీడిమెట్ల, షాపూర్ లో కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న ముఠా బండారం బయటపడింది. కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న గోడౌన్ పై SOT పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.  ఐస్ క్రీమ్ తయారీలో దుర్మార్గులు అపరిశుభ్రమైన నీటిని ఉపయోగిస్తన్నారు. ఆ నీళ్లలోనే వివిధ ప్లేవర్స్ కు సంబంధించిన పానకాన్ని తయారు చేస్తున్నారు. డెలిసియస్ పేరుతో ఫిరోజ్ అనే నిందితుడు ఈ కల్తీ ఐస్ క్రీములను తయారు చేస్తూ విక్రయిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఫిరోజ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. 15 లక్షల విలువ గల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.  కల్తీ ఐస్ క్రీములను కూడా అధికారులు సీజ్ చేశారు.