ఢిల్లీకి భారీగా హర్యానా రైతులు : మద్దతుగా టోల్ ఫీజు రద్దు

ఢిల్లీకి భారీగా హర్యానా రైతులు : మద్దతుగా టోల్ ఫీజు రద్దు

వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేశారు. రైతులకు పలువురు మద్దతు ఇస్తున్నారు. ఆందోళనలో పాల్గొనేందుకు పొరుగురాష్ట్రాల నుంచి ఢిల్లీకి పెద్ద సంఖ్యలో రైతులు చేరుకుంటున్నారు. దీంతో హర్యానా అంబాలాలోని షంభు టోల్ ప్లాజాలో ఇవాళ ఎవరిదగ్గరా చార్జీలు వసూలుచేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. ఉచితంగానే వాహనాలను అనుమతిస్తున్నారు.