Balakrishna, Anjali: బాలకృష్ణ ఇన్సిడెంట్పై స్పందించిన అంజలి.. ట్విట్టర్ పోస్ట్ వైరల్

Balakrishna, Anjali: బాలకృష్ణ ఇన్సిడెంట్పై స్పందించిన అంజలి.. ట్విట్టర్ పోస్ట్ వైరల్

యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన గ్యాంగ్స్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా నందమూరి బాలకృష్ణ వచ్చిన విషయం తెలిసిందే. ఎంతో ఘనంగా జరిగిన చిత్ర యూనిట్ పాల్గొన్నారు. అయితే.. బాలకృష్ణ స్టేజిపైకి వచ్చిన తరువాత హీరోయిన్ అంజలిని నెట్టేయడం అనేది చాలా వైరల్ అయ్యింది. బాలకృష్ణ అలా అంజలిని నెట్టేయడంపై సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగింది. ఈ విషయంపై మేకర్స్ కూడా మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చారు. 

తాజాగా ఇదే విషయంపై హీరోయిన్ అంజలి స్పందించారు. ఈ విషయం గురించి ఆమె తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ గా బాలకృష్ణ గారు వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు. బాలకృష్ణ గారికి.. నాకు ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉంది. మేమిద్దరం చాలా కాలంగా మంచి ఫ్రెండ్స్. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది.. అంటూ రాసుకొచ్చారు అంజలి.

అయితే.. బాలకృష్ణ తనని తోయడం గురించి కానీ, దాని గురించి బయట వస్తున్న కామెంట్స్ గురించి కానీ ఆమె ఎక్కడా ప్రస్తావించలేదు. కాబట్టి ఆ విషయాన్ని ఆమె అంత సీరియస్ గా తీసుకోలేదని అర్థమవుతోంది. ఇక ఆ విషయం గురించి ఆడియన్స్ కూడా పెద్దగా పాటించుకోవాల్సిన అవసరం లేదని ఆమె ఇండైరెక్ట్ గా చెప్పేశారు. మరి ఈ పోస్ట్ తరువాతైనా ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడటం ఆపేస్తారా అనేది చూడాలి.