జీవీ ప్రకాష్ కుమార్, ‘మ్యాడ్’ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ జంటగా రూపొందిన తమిళ చిత్రం ‘హ్యాపీ రాజ్. ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ దీనికి దర్శకుడు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై జైవర్ద నిర్మించారు.
మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతోంది. శుక్రవారం ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో ఈ విషయాన్ని తెలియజేశారు. ఈనెల 27న తమిళంతో పాటు తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిఫ్రెషింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అబ్బాస్, జార్జ్ , గీతా కైలాసం, ప్రార్థన నాథన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు.
