వైవిధ్యమైన టైటిల్‌తో, హారర్ జానర్‌లో వస్తున్న ‘దిష్టి బొమ్మ’ చిత్రం విజయం సాధించాలని, టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని దర్శకుల సంఘం అధ్యక్షులు వీఎన్ ఆదిత్య విష్ చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్, ట్రైలర్‌ను ఆయన విడుదల చేశారు. ఆర్.గోపు బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఉమేశ్ రాయల్, గాయత్రి , మౌనిక, మురళి, అమిదాబ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
కె.ఎస్.సినిమాస్ బ్యానర్‌పై పుండాల ఉమాపతి, ఆర్.గోపు నిర్మిస్తున్నారు. హారర్ జానర్‌లో ఎవరూ టచ్ చేయని సరికొత్త పాయింట్‌తో ఈ సినిమా తీస్తున్నామని, భువనచంద్ర సాహిత్యం అందించిన పాటలను త్వరలో విడుదల చేసి, సినిమా రిలీజ్ డేట్‌ను రివీల్ చేస్తామని దర్శకనిర్మాతలు తెలియజేశారు.
