నీ పెదవి అలికిడి.. నాలో అలజడి.. ‘గోదారి గట్టుపైన’ థర్డ్ సాంగ్ రిలీజ్

నీ పెదవి అలికిడి.. నాలో అలజడి.. ‘గోదారి గట్టుపైన’ థర్డ్ సాంగ్ రిలీజ్

సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటిస్తున్న చిత్రం ‘గోదారి గట్టుపైన’.  శుక్రవారం థర్డ్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. నాగ వంశీ కృష్ణ కంపోజ్ చేసిన ఈ మెలోడీకి బాలాజీ లిరిక్స్ అందించగా, కేఎస్ చిత్ర, ఎస్పీ చరణ్ కలిసి పాడటం హైలైట్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది.

‘బంగారు బొమ్మ.. ఓహో అందాల గుమ్మ.. మనసంతా నిండిన మాట చెప్పాలమ్మా.. నిన్ను చూస్తే దాగదు నోట ఎట్టాగమ్మా.. ఆ కబురు వినమని అంటూ నా ఎదకు తొందరలే..  నీ పెదవి అలికిడి వింటే నాలోని అలజడిలే.. కలిసినా కలనైనా నా హృదయం నీదిలే..’ అంటూ ప్లెజెంట్‌‌‌‌‌‌‌‌గా సాగిన పాట ఆకట్టుకుంది.

సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ వింటేజ్ లుక్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తూ ఇంప్రెస్ చేశారు. సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అభినవ్ రావు నిర్మిస్తున్నారు.   జగపతిబాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.