సందేశాత్మకంగా ‘మా రాముడు అందరివాడు’ సినిమా

సందేశాత్మకంగా ‘మా రాముడు అందరివాడు’ సినిమా

శ్రీరామ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైఖేల్ దర్శకత్వంలో అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్నారు. త్వరలో రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్రంలోని ‘ఇడిసెల్లిపోయావా’ పాటను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ లాంచ్ చేసి టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.

ఈ పాటకు డైరెక్టర్ యద్దనపూడి మైఖేల్ సాహిత్యాన్ని అందించి, నల్గొండ గద్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (నర్సారెడ్డి)తో కలిసి పాడారు. స్వాతి హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్, ఆనంద్ భారతి,  గడ్డం నవీన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సమాజానికి సందేశం ఇచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ చెప్పారు.