ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు 100 టన్నుల బంగారం తెచ్చిన RBI

ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు 100 టన్నుల బంగారం తెచ్చిన RBI

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రిటన్ నుంచి 100 టన్నుల బంగారాన్ని భారత్ కు తీసుకువచ్చింది. అప్పుడప్పుడు ఆర్బీఐ గోల్డ్ కొని విదేశాల్లో నిల్వ చేస్తుంది. ఇది విదేశీ మారక ద్రవ్య నిల్వలుగా పరిగణిస్తారు. 2024 మార్చి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 822.1 టన్నుల బంగారం ఉంది. ఇంత పెద్ద మొత్తాన్ని ఇండియాలోనే ఉంచితే సెక్కురిటీ ప్రాబ్లమ్స్ వస్తాయ్ కనుక.. కొంత విదేశాల్లో నిల్వ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న గోల్డ్ లో 413 టన్నుల బంగారం విదేశాల్లోనే వివిధ బ్యాంకుల్లో దాచిపెట్టింది.

ఇండియా ఓవర్సీస్ స్టాక్ పెరిగిపోతున్నందున విదేశాల్లో ఉంచిన బంగారంలో కొంత ఇండియాకు తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బ్రిటన్ లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ లో ఉన్న 100 టన్నుల బంగారాన్ని బారత్ కు తీసుకొచ్చింది. దాన్ని ముంభైలోని మింట్, నాగ్ పూర్ ఆర్బీఐ పాత ఆఫీస్ లో భద్రపరిచింది. ఆర్బీఐ కొన్ని బంగారం అత్యవసర ఆర్థిక పరిస్థితుల్లో, విదేశాలతో వ్యాపారం చేసినప్పుడు వాటితో లావాదేవీలు జరుపుతుంది. అంతేకాదు.. రోజురోజుకు బంగారం విలువ పెరుగుతుంది కాబట్టి విదేశీ మారక ద్రవ్యం నిల్వల్లో గోల్డ్ ఉండటం ఇండియా ఆర్థిక వ్యవస్థకు బలం.