ఏసీబీ వలలో వనపర్తి  ట్రాన్స్‌కో ఆఫీసర్లు

ఏసీబీ వలలో వనపర్తి  ట్రాన్స్‌కో ఆఫీసర్లు

వనపర్తి, వెలుగు : లంచం తీసుకుంటూ వనపర్తి విద్యుత్ శాఖ ఎస్ఈ, డీఈ, ఏఈ శుక్రవారం రాత్రి ఏసీబీకి పట్టుబడ్డారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్వెన గ్రామం వద్ద ఓ రెస్టారెంట్ కు పోల్ వేయడం, ట్రాన్స్​ఫార్మర్, త్రీ ఫేస్  కరెంట్​ఇచ్చేందుకు విద్యుత్ ఆఫీస్ అధికారులు.. బాధితుడి లక్ష్మీనారాయణ బంధువు ప్రవీణ్ కుమార్​ను రూ.19 వేలు లంచం అడిగారు.

దీంతో ప్రవీణ్ ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శుక్రవారం వనపర్తిలోని విద్యుత్ ఆఫీసులో ఎస్ఈ నాగేంద్రకుమార్ ​సమక్షంలో డీఈ నరేంద్ర కుమార్​కు రూ.10 వేలు, ఏఈ మధుకర్ కు రూ.9 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విచారణ తర్వాత ఎస్ఈ నాగేంద్ర కుమార్, డీఈ నరేంద్రకుమార్, ఏఈ మధుకర్ ను అరెస్ట్​ చేశారు.