- వ్యయ పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రివ్యూ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థుల ఖర్చులపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి మంగళవారం స్టేట్ ఎలక్షన్ ఆఫీస్లో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కౌముదిని వ్యయ పరిశీలకులతో సమావేశం నిర్వహించారు.
సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల ఖర్చు కోసం ప్రత్యేకంగా బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఓపెన్ చేసిన ఖాతాల వివరాలను వెంటనే సేకరించాలని ఆదేశించారు. అభ్యర్థులు చేసిన లావాదేవీల వివరాలను ఆయా బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
