ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శివారులోని అంకాపూర్ గ్రామ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. వివరాలిలా ఉన్నాయి.. నిజామాబాద్‌కు చెందిన సాయిప్రసాద్(21) ఆర్మూర్‌కు బుల్లెట్‌పై వస్తుండగా, ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో సప్తగిరి ఫంక్షన్ హాల్ సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో సాయిప్రసాద్ తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఎడపల్లి మండలం జాన్కంపేటకు చెందిన సంధ్యారాణి(35) తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరాటి హారిక కుడికాలు విరగగా, మిగతా నలుగురికి గాయాలయ్యాయి. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు.
