కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : పి .సుదర్శన్ రెడ్డి

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి :  పి .సుదర్శన్ రెడ్డి
  • ప్రభుత్వ సలహాదారు పి .సుదర్శన్​ రెడ్డి

బోధన్, వెలుగు : కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్​ రెడ్డి సూచించారు. ఆదివారం బోధన్ పట్టణంలో  మున్సిపల్​ ఎన్నికల్లో భాగంగా  ప్రచారం నిర్వహించారు. బోధన్​లోని అంబేద్కర్ కాలనీ, శ్రీనివాసనగర్, రెంజల్ బేస్, గంజ్​రోడ్, దేగంకగల్లి, వినాయకనగర్​,  ఆచన్​పల్లి ప్రాంతాల్లో పర్యటించారు. కాంగ్రెస్​ పార్టి అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధిని చేసుకోవచ్చునని తెలిపారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు , వీధిలైట్లు వంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చున్నారు. కాంగ్రెస్​ పార్టీ ఇప్పటికే ఇచ్చిన హామీలు నేరవేరుస్తుందని తెలిపారు.

తెలంగాణలోని మహిళలకు ఉచితబస్సు , సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే బోధన్​ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజురు చేసినట్లు తెలిపారు. విడతల  వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్​ చైర్మెన్​ ఆనంపల్లి ఎలయ్య, మాజీ మున్సిపల్​ చైర్​ పర్సన్ భర్త శరత్​ రెడ్డి, కాంగ్రెస్​ పార్టీకి చెందిన నాయకులు, కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులు,  మహిళలు పాల్గొన్నారు.