- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ
కామారెడ్డిటౌన్, వెలుగు: బీజేపీ బీఆర్ఎస్ ఒకే నాణానికి రెండు ముఖాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ విమర్శించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 8,12,31,34, 35, 36,37 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున షబ్బీర్అలీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో దోస్తి, గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీజేపీ , బీఆర్ఎస్ పార్టీలు వ్యవహారిస్తూ ప్రజలను మోసగిస్తున్నాయన్నారు.
అబద్ధాల బీఆర్ఎస్, విభజన బీజేపీలను ప్రజలు తిరస్కరించాలన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. కామారెడ్డి పట్టణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు అదరించాలని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఆయా వార్డలు అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.
