బీజేపీ తీరుకు చిన్నపిల్లలు నవ్వుతున్నరు : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

బీజేపీ తీరుకు చిన్నపిల్లలు నవ్వుతున్నరు : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

నిజామాబాద్​, వెలుగు:  ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారు పిలువగానే పలికే నాయకులు అవసరమని టీపీసీసీ చీఫ్​ మహేశ్​ ​కుమార్​గౌడ్​ అన్నారు. ప్రశాంతంగా ఉన్న సమాజంలో బీజేపీ కలుషిత రాజకీయాలు ఏ మాత్రం ఆమోదం కాదన్నారు. ఆదివారం నిజామాబాద్​ నగరంలోని  కోటగల్లిలో కాంగ్రెస్​ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించి కార్నర్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీని విశ్వసించొద్దని, స్థానిక డెవలప్​మెంట్​ కోసం జరుగుతున్న ఎలక్షన్​లో దేవుడి పేరెందుకని పిల్లలు కూడా  నవ్వుకుంటున్నారన్నారు.  మున్సిపల్​ కార్పొరేషన్​లో కాంగ్రెస్​ జెండా ఎగురేయాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు.

పదేండ్లలో అభివృద్ధి చాలా వెనుకబడిందని, దానిని పరుగులు పెట్టించాల్సి ఉందన్నారు. సీఎం రేవంత్​రెడ్డి వద్దే మున్సిపల్​ శాఖ ఉన్నందున ఫండ్స్​ కొరత ఉండదని తెలిపారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో రేషన్​ కార్డులకు సన్నబియ్యం ఇస్తలేరని, తమ సర్కార్​ వచ్చాక కొత్త రేషన్​ కార్డులివ్వడమే కాకుండా  ఖర్చుకు వెనుకాడక సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. 200 యూనిట్ల లోపు కరెంట్​ ఫ్రీ, మహిళలకు ఉచిత బస్​ జర్నీ తో పాటు రూ.500 గ్యాస్​ సిలిండర్​ పంపిణీ చేస్తున్నామన్నారు. వేల సంఖ్యలో డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు ఇచ్చామన్నారు. పేదల ఆకలి తీర్చడంతో పాటు వారికి అండగా ఉండే స్కీమ్​లకంటే గొప్ప ఏముంటదని అది బీజేపీ, బీఆర్​ఎస్​కు  చేతకాదన్నారు.

అద్దాలు పట్టుకొని చేతులూపుతూ రాజకీయాలు చేస్తున్నరని మండిపడ్డారు.   నిజామాబాద్​ను దేశంలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలనే తమ సంకల్పానికి సపోర్టుగా నిలవాలని ప్రజలను కోరారు. జిల్లాలో 35 ఏండ్ల నుంచి నానుతూ వచ్చిన గవర్నమెంట్​ ఇంజినీరింగ్​ కాలేజీని టీపీసీసీ ప్రెసిడెంట్​గా మూడు నెలల్లో తెచ్చానని, అగ్రికల్చర్​ కాలేజీ కూడా శాంక్షన్​ చేయించగా బిల్డింగ్​ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన వేశారన్నారు. ఉర్దూ అకాడెమీ చైర్మన్​ తాహెర్​, డీసీసీ ప్రెసిడెంట్​ నగేష్​రెడ్డి, డాక్టర్​ కవితారెడ్డి తదితరులు ఉన్నారు.