జ్యోతిష్యం: సందద కలుగజేసే శుక్రుడు నక్షత్రం మారుతున్నాడు.. ఇక ఆ రాశుల వారికి డబ్బే.. డబ్బు..!

జ్యోతిష్యం:  సందద కలుగజేసే శుక్రుడు నక్షత్రం మారుతున్నాడు.. ఇక ఆ రాశుల వారికి డబ్బే.. డబ్బు..!

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం...  సంపద.. ఐశ్వర్యానికి కారణమైన శుక్రుడు ఈ ఏడాది (2026) చివరి రోజుల్లో అంటే డిసెంబర్​ 30 వతేది స్థానాన్ని మార్చుకుంటాడు.  ప్రస్తుతం సంచరిస్తున్ననక్షత్రాన్ని వదిలి.. పూర్వాషాడ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.  శుక్రుడు నక్షత్రం మార్పు వల్ల కొందరి జీవితాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ రాశుల వివరాలతో మిగతా రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !

మేష రాశి :  శుక్రుడు స్థానచలనం వలన ఈరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఉద్యోగస్తులు కార్యాలయంలో అనుకోకుండా ప్రశంసలుఅందుకుంటారు.  కొత్త ఆంగ్ల సంవత్సరంలో (2026) అప్పులు తీరే అవకాశం ఉంది,  కేరీర్​ విషయంలో ఊహించనంత అభివృద్ది ఉంటుంది.  పూర్వీకుల ఆస్థి కలసి రావడంతో  కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  నిరుద్యోగులకు గడ్​ న్యూస్​ అందుతుంది.  విదేశాలకు వెళ్లాలన్న మీ డ్రీమ్ నెరవేరుతోంది. వైవాహిక జీవితంలో ఉన్న కలతలన్నీ తొలగిపోవడంతో చాలా ఆనందంగా గడుపుతారని పండితులు చెబుతున్నారు.

వృషభ రాశి : ఈరాశి వారికి  శుక్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో సంచారం వలన  జీవితంలో అనేక మార్పులు జరిగే అవకాశం ఉంది.  కొన్ని రోజుల నుంచి పడుతున్న కష్టాలకు ఉపశమనం కలుగుతుంది.  ఆర్థికంగా అభివృద్ది ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  కొత్త ఇల్లు కట్టేందుకు కాని.. కొనేందుకు కాని  చేసిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

మిధునరాశి: పూర్వాషాఢ నక్షత్రంలో శుక్రుడు సంచరించడం వల్ల ఈ రాశి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఊహించని ప్రయోజనాలను పొందే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొత్త గాపెట్టుబులు పెట్టేవారికి భారీగా లాభాలు వస్తాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు వస్తాయి. ఒక్కసారిగా మీ ఆదాయం కూడా పెరుగుతుంది. వ్యక్తిగ  జీవితంలో సానుకూల మార్పులు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు... వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు మొదలు పెట్టే ఎలాంటి పనుల్లోనైనా విజయాలు సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మీరు ఊహించని విధంగా డబ్బు పెరిగే అవకాశాల కూడా ఉన్నాయి.  

కర్కాటకం:  శుక్రుడు నక్షత్రం మార్పు  ఈ రాశి వారికి  చాలా గుర్తుండిపోతుందని పండితులు చెబుతున్నారు. కేరీర్​ పరంగా ఈ సమయంలో తీసుకున్న నిర్ణయం జీవితంలో స్థిరత్వాన్ని సాధించే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు వస్తాయి.  ఆఫీసులో కీలక బాధ్యతలు తీసుకుంటారు.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  మీరు పొదుపు చేయడంలో కూడా విజయం సాధించవచ్చు. ఈ కాలంలో పెట్టుబడి ప్రయోజనకరంగా ఉంటుంది. . మానసిక ఒత్తిడి కొద్దిగా తగ్గుతుంది.. ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు సూచిస్తున్నారు. 

సింహరాశి   : పూర్వాషాడా  నక్షత్రంలోకి శుక్రుడు సంచరించడం వలన ఈ రాశి వారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆర్ధికలావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టేవిషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుకున్న పనులు నత్తనడకన కొనసాగుతాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పవని పండితులు చెబుతున్నారు.  నిత్యం గణపతిని ప్రార్థించండి .. సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. 

కన్యారాశి: శుక్రుడు ... పూర్వాషాడ నక్షత్రంలోకి ప్రవేశించిన తరువాత ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు ఆర్థిక విషయాలకు సంబంధించి ప్రత్యేక నిర్ణయం తీసుకోవచ్చు. ప్రేమ జీవితంలో కూడా పూర్తి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది. దీనితో పాటు, మీరు మీ సహోద్యోగులతో బాగా కలిసిపోతారు. సీనియర్ అధికారుల సహకారంతో మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. దీంతో పాటు కెరీర్‌లో చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అప్పుల బాధ నుంచి ఉపశమనం పొందడం ద్వారా ఆర్థిక స్థితి బలపడుతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి.

తులా రాశి :  నూతన ఆంగ్లసంవత్సరం ( 2026) ప్రారంభానికి సరిగ్గా ఒక్క రోజుకు ముందు శుక్రుడు .. పూర్వషాడ నక్షత్రంలోకి మారడం వలన కొత్త సంవత్సరంలో కష్టాలన్నీ తీరే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.  పెళ్లి కోసం ఎదురు చూసే వారికి అనుకోకుండా సంబంధం కుదురుతుంది.  ఆర్థికంగా స్థిరపడే అవకాశాలున్నాయి.  ఇప్పటి వరకు మందకొడిగా సాగిన వ్యాపారాలు ఒక్కసారిగా పుంజుకుంటాయి.  సమస్యలు పరిష్కారం కావడంతో.. మానసికంగా ప్రశౄంతత పొందుతాయి. కెరీర్​ విషయంలో ఎన్నడూ లేనంత అభివృద్దిని సాధిస్తారు.  

వృశ్చికరాశి:  శుక్రుడు నక్షత్రం మారడం వలన ఈ రాశి వారు జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి.  ఆఫీసులో సీనియర్ల సహకారం ఉంటుంది.  ఆర్ధిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కుటుంబ జీవితం సాఫీగా ఉంటుంది.  వ్యాపారస్తులకు సామాన్య ఫలితాలుంటాయి.  కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలను వాయిదావేయండి. 

ధనుస్సు రాశి : శుక్రుడు ... పూర్వాషాడ నక్షత్రంలోకి మారడం వలన ఈ రాశి వారికి   సమాజంలో గౌరవం కీర్తి పెరుగుతాయి.  కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది.  ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. నూతనంగా ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  గతంలోని ఇబ్బందులు పరిష్కారమవుతాయి. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది.  కెరీర్​ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది.  ఆర్థిక పరిస్థితి అద్భుతంగాఉండే అవకాశాలున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  కుటుంబ జీవితం హ్యాపీగా కొనసాగుతుంది. 

మకర రాశి : ఈ రాశి వారు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.  శుక్రుడి స్థానం మార్పు కారణంగా ఆస్థి వివాదాలు పరిష్కారమవుతాయి.  కొంత కాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.  కెరీర్​ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జాబ్​ మారాలనుకునే వారికి ఈ సమయం అనుకూలమని పండితులు చెబుతున్నారు. జీవితంలోని ఒత్తిళ్ల నుండి బయటపడతారు. ప్రతిచోటా విజయాన్ని అందుకుంటారు.  ప్రతి పనిలో కూడి విజయం అందుకుంటారని పండితులు చెబుతున్నారు. 

కుంభ రాశి :  శుక్రుడు ... పూర్వాషాడా  నక్షత్రంలోకి మారడం వలన ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మీ లక్ష్యానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి.  ఆర్థికంగా బాగాఅభివృద్ది చెందుతారు.  శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీరు అనుకున్నది సాధిస్తారు. మీకు లక్ కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడితే అనుకోని లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుందని  పండితులు చెబుతున్నారు. 

మీన రాశి :  శుక్రుడి నక్షత్రం మార్పు ఈ రాశి వారికి స్వర్ణ యుగం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.  ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.  సంతాన విషయంలో శుభవార్త వింటారు.  ఉద్యోగస్తులకు చాలా లక్కీ సమయమని పండితులు చెబుతున్నారు.  వ్యాపారస్తుల విషయంలో ఎన్నడూ చూడని లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు  ప్రమోషన్​ తో పాటు వేతరం పెరిగే అవకాశం ఉంది. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.