హైదరాబాద్, వెలుగు: ఏఐ ప్లస్ సంస్థ నోవాపాడ్స్ పేరుతో ఇయర్‌బడ్స్‌ను తీసుకొచ్చింది. ఇవి కేవలం సంగీతాన్ని అందించడమే కాకుండా హార్ట్ రేట్ ట్రాకింగ్, ఎస్పీఓ2 మానిటరింగ్ వంటి ఆరోగ్య ఫీచర్లనూ అందిస్తాయి.
వచ్చే ఏడాది మొదటి క్వార్టర్ లో అందుబాటులోకి రానున్న ఈ నోవాపాడ్స్ ధరలు రూ.వెయ్యి లోపే ఉంటాయి. గో, ఎయిర్, ప్రో, బీట్స్, క్లిప్స్ అనే ఐదు రకాల మోడళ్లలో ఇవి లభిస్తాయి. నోవాపాడ్స్ను 2026 జనవరి నుంచి ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా అమ్ముతామని ఏఐ ప్లస్ తెలిపింది.
