రవాణా శాఖలో ఘరానా తిమింగలం.. డీటీసీ ఆస్తులు రూ. 250 కోట్లు.. ఇతని అవినీతి చరిత్ర చూస్తే..

రవాణా శాఖలో ఘరానా తిమింగలం.. డీటీసీ ఆస్తులు రూ. 250 కోట్లు.. ఇతని అవినీతి చరిత్ర చూస్తే..
  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌‌ కిషన్‌‌ నాయక్‌‌ అరెస్ట్‌‌
  •     మహబూబ్‌‌నగర్‌‌‌‌ డిస్ట్రిక్ట్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ ఆఫీసు సహా 
  • 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ
  •     కిలో బంగారం, రూ.1.37 కోట్ల నగదు సీజ్‌‌
  •     వ్యవసాయ భూమి, కమర్షియల్‌‌ స్థలం, ఫ్లాట్లు, ఫర్నిచర్​ దుకాణం ఉన్నట్టు గుర్తింపు
  •     బినామీల పేర్లతో ఉన్న డాక్యుమెంట్లు, రెండు కార్లు సీజ్‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: 
రవాణాశాఖ మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ డిప్యూటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌ (డీటీసీ) కిషన్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడ బెట్టాడడన్న ఫిర్యాదులతో  సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లోని కిషన్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌ ఇంటితోపాటు మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసు, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని 15 ప్రాంతాల్లో  సోదాలు నిర్వహించారు. 

మంగళవారం తెల్లవారుజాము నుంచి నిర్వహించిన తనిఖీల్లో గుర్తించిన ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే నివ్వెరపోయారు. బోయిన్‌‌‌‌‌‌‌‌పల్లిలోని ఇంటి నుంచి కిలో బంగారం, బ్యాంకులో రూ.1.37 కోట్లు నగదు సీజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో కమర్షియల్ కాంప్లెక్సులు, హోటల్‌‌‌‌‌‌‌‌, సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయభూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బినామీల పేర్లతో ఉన్న డాక్యుమెంట్లు, రెండు కార్లు కూడా సీజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్​ డీటీవో ఆఫీసులో కీలకమైన డాక్యుమెంట్లు, రికార్డులు, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సోదాల్లో సీజ్‌‌‌‌‌‌‌‌ చేసిన ఆస్తుల విలువ  రూ.12.72 కోట్లుగా నిర్ధారించారు. కాగా, ప్రస్తుత బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో విలువ ప్రకారం సుమారు రూ.250 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ మోటార్‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ నుంచి మొదలై డీటీసీ స్థాయికి వచ్చేప్పటికి కిషన్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. అక్రమార్జనపై అందిన పక్కా సమాచారంతోనే ఏసీబీ సెంట్రల్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌ జాయింట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.

ఏసీబీ గుర్తించిన ఆస్తులు ఇవే.. 

  • నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లోని లాహిరి ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ హోటల్‌‌‌‌‌‌‌‌లో 50 శాతం వాటా 
  • నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో 3 వేల చదరపు గజాల్లో రాయల్‌‌‌‌‌‌‌‌ఓక్‌‌‌‌‌‌‌‌ ఫర్నీచర్‌‌‌‌‌‌‌‌ దుకాణం 
  • నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లోని అశోక టౌన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో రెండు ఫ్లాట్లు 
  • సంగారెడ్డి జిల్లా నిజాంపేట్‌‌‌‌‌‌‌‌ తాసిల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో 31 ఎకరాల వ్యవసాయ భూమి  
  • నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ లిమిట్స్‌‌‌‌‌‌‌‌లో 10 ఎకరాల కమర్షియల్‌‌‌‌‌‌‌‌ భూమి  
  • సంగారెడ్డి జిల్లా నిజాంపేట్‌‌‌‌‌‌‌‌ మండల పరిధిలో 4 వేల చదరపు అడుగులలో పాలహౌస్‌‌‌‌‌‌‌‌ షెడ్‌‌‌‌‌‌‌‌  
  • బ్యాంకులో రూ.1.37 కోట్ల నగదు.    కిలో బంగారు ఆభరణాలు 
  • ఒక హోండాసిటీ, ఒక ఇన్నోవా క్రిస్టా కారు