Beauty Tips: ఇది ఆరోగ్యానికే కాదు.. తెల్లజుట్టును తగ్గిస్తుంది.. బ్లాక్ హెయిర్ ను పెంచుతుంది

Beauty Tips: ఇది ఆరోగ్యానికే కాదు.. తెల్లజుట్టును తగ్గిస్తుంది.. బ్లాక్ హెయిర్ ను పెంచుతుంది

పూర్వకాలంలో జనాలకు 60 ఏళ్లు వచ్చినా.. 20 ఏళ్ల వారి వలే చురుకుగా.. చలాకీగా ఉండేవారు.  అయితే  వయస్సు పెరగడంలో అక్కడక్కడ కొద్ది కొద్దిగా తెల్ల జుట్టు వచ్చేది.. దీనిని బట్టి  వారి వయస్సును కొంత వరకు లెక్కేసారు.  కాని ఇప్పుడు మాత్రం ఆరేళ్లకే .. అరవై ఏళ్ల వారికంటె ఎక్కువుగా జుట్టు తెల్లబడుతుంది.  మరి కొంతమందికైతే.. బట్టతల కూడా వచ్చేస్తుంది.. దీనిని కవర్  చేయడానికి వారు పడే ఇబ్బందులు అంత ఇంతా కాదు..  అయితే  ఇలాంటి  ఇబ్బందులనుంచి బయటపడాలంటే బ్యూటీ టిప్స్  గురించి తెలుసుకుందాం. . .

 చిన్నవయసులో జుట్టు నెరిసిపోవడం వల్ల రూపురేఖలు చెడిపోవడమే కాకుండా ఆత్మవిశ్వాసం కూడా పోతుంది. జుట్టు నెరసిపోతుందనే భయంతో చాలా మంది హెన్నా, కలరింగ్‌ని ఎంచుకుంటారు. కానీ మీ జుట్టు 10 నుండి 15 సంవత్సరాల వయస్సులో తెల్లబడిపోవడం, ఊడిపోతుంటే టెన్షన్‌ పడుతుంటారు. చిన్నవయసులోనే జుట్టు తెల్లబడటం మొదలుపెడుతుందంటే శరీరంలో అంతా సవ్యంగా సాగడం లేదని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది సమస్య కారణంగా జరుగుతోంది.

జుట్టు పెరగడానికి చాలా మంది ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. అయితే, బయట దొరికేవి మాత్రమే కాకుండా కిచెన్‌లోనే దొరికే కొన్ని టిప్స్ ఫాలో అవ్వొచ్చు. జుట్టు రాలడం, జుట్టు చిట్లడం, పొడి జుట్టు, చుండ్రు వంటి అనేక రకాల జుట్టు సమస్యలు ఉన్నాయి. మంచి ఆహారం తీసుకుంటే జుట్టుని కాపాడుకోవచ్చు. చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో జుట్టు తెల్లబడడం. ఇందుకోసం ఇంట్లోనే తయారుచేసే హెయిర్ మాస్క్ జుట్టు అందాన్ని కాపాడుకోవచ్చు.

బీట్‌రూట్ : బ్యూటీ కేర్‌లో బీట్‌రూట్ ముందుంటుంది. బీట్‌రూట్ హెయిర్‌ఫోలికల్స్‌కి పోషణని అందిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగదలకి బీట్‌రూట్ హెల్ప్ చేస్తుంది. బీట్‌రూట్‌లో జుట్టు కుదుళ్ళకి అవసరమైన విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్ జుట్టు రాలడాన్ని తగ్గించొచ్చు. చుండ్రుని తగ్గించడంలో కూడా కూడా హెల్ప్ చేస్తుంది. బీట్‌రూట్‌ని వాడడం వల్ల తెల్ల జుట్టు తగ్గుతుంది. బీట్‌రూట్‌‌లో విటమిన్ సి, ఇ, కెరోటిన్స్ ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టుని నల్లగా మార్చడానికి ఎంతో ఉపయోగపడతాయి. . 

మెంతులు: జుట్టు రాలడాన్ని తగ్గించడంలో మెంతులు ముందుంటాయి. ఇందులోని అమినో యాసిడ్స్ జుట్టుు పెరుగుదలకి హెల్ప్ చేస్తాయి. జుట్టుని పాడు చేసే కెమికల్స్ ఈ మెంతులు దూరం చేస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజమైన రీతిలో జుట్టు పెరుగుదలకి మెంతులు హెల్ప్ చేస్తాయి. ఇందులో జుట్టుని బలంగా చేయడానికి సహాయపడే లెసిథిన్ ఉంటుంది. మెంతులు జుట్టుని మాయిశ్చరైజ్‌గా ఉంచుతుంది.

అలోవెరా: జుట్టు రాలడాన్ని తగ్గించడానికి అలోవెరా బాగా పనిచేస్తుంది. అలోవెరాలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. తలలో పిహెచ్ స్థాయిని బ్యాలెన్స్ చేయడంలో కలబంద ముందుంటుంది.

కాఫీ పొడి: కాఫీ పౌడర్ జుట్టు సంరక్షణలో, చర్మ సంరక్షణలో ముందుంటుంది. జుట్టు పెరుగుదలకి కాఫీ పౌడర్ చాలా మంచిది. కాఫీ పౌడర్ మూలాల నుండి జుట్టుని బలోపేతం చేయడానికి హెల్ప్ చేస్తుంది. కాఫీ పౌడర్ పొడి జుట్టుతో పాటు డ్యామేజ్ అయిన జుట్టుని స్ట్రెయిట్ చేస్తుంది. జుట్టుని మృదువుగా చేయడానికి కాఫీ పౌడర్ కూడా మంచిది. జుట్టు నెరసిపోయే సమస్యని కాఫీ పౌడర్ దూరం చేస్తుంది.

హెయిర్ మాస్క్‌ కోసం : బీట్‌రూట్‌లో నానబెట్టిన మెంతులు రెండు స్పూన్లు వేసి మిక్సీ పెట్టాలి. ఇందులో కొద్దిగా నీరు పోసి కాఫీ పౌడర్ వేసి మరిగించాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత వడకట్టి ఓ కప్పు హెన్నా పౌడర్ వేయాలి. ఇందులో అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. దీనిని రాత్రంతా అలానే ఉంచి నెక్ట్స్ డే జుట్టుకి అప్లై చేయాలి. ఓ గంట, రెండు గంటల తర్వాత జుట్టుని క్లీన్ చేసుకోవాలి.