O2 Ott: సైలెంట్గా OTTకి వచ్చేసిన మెడికల్ థ్రిల్లర్.. చూస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం

O2 Ott: సైలెంట్గా OTTకి వచ్చేసిన మెడికల్ థ్రిల్లర్.. చూస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం

కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమిగోస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది లేటెస్ట్ బ్యూటీ ఆషిక రంగనాథ్. మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేదు కానీ, ఆషిక గ్లామర్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఈ సినిమా తరువాత ఏకంగా కింగ్ నాగార్జున పక్కన హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది. అదే నా సామిరంగా. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మంచి విజయాన్ని సాధించింది. 

ఇదిలా ఉంటే.. ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా కన్నడలో O2 అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. రాఘవ్‌ నాయక్‌ - ప్రశాంత్‌ రాజ్‌ ద్వయం తెరకెక్కించిన ఈ సినిమాలో దర్శకుడు రాఘవ్‌ నాయక్‌ కీ రోల్ చేశారు. మెడికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డైరెక్ట్ ఓటీటీకి వచ్చింది O2. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్స్ లో మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

ఇక ఆషిక రంగనాథ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ హీరోగా వస్తున్న భారీ మూవీ విశ్వంభరలో నటిస్తున్నారు. దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో త్రిష హీరోయిన్ గా చేస్తుండగా.. ఒక కీ రోల్ కోసం ఆషికను తీసుకున్నారట మేకర్స్. ఇదే విషయంపై ఇటీవలే అధికారిక ప్రకటన కూడా చేశారు. మరి ఈ సినిమాతో ఆషిక ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.