T20 World Cup 2024: రేపే భారత్- బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే

T20 World Cup 2024: రేపే భారత్- బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే

టీ20 ప్రపంచకప్ సమరానికి సమయం దగ్గర పడుతోంది. శనివారం(జూన్ 1)తో వార్మప్ మ్యాచ్‌లు ముగియనుండగా.. ఆదివారం(జూన్ 2) ఉదయం 6 గంటల నుంచి అసలు మ్యాచ్‌లు షురూ కానున్నాయి. శనివారం భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచే.. ఆఖరి వార్మప్ గేమ్. ప్రాక్టీస్ మ్యాచ్ అయినప్పటికీ.. దీనిని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.. 

న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ప్రధాన మ్యాచ్‌లకు ముందు భారత జట్టు ఆడే ఏకైక వార్మప్ గేమ్ ఇదే. ఇప్పటికే భారత ఆటగాళ్లందరూ అమెరికా చేరుకొని ప్రాక్టీస్ లో తలమునకలై ఉన్నారు. కోహ్లీ ఒక్కడు ఆలస్యంగా న్యూయార్క్ చేరుకోగా.. బంగ్లాతో మ్యాచ్‌కు అతను అందబాటులో ఉంటాడా..! లేదా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు అమెరికాతో జరగాల్సిన బంగ్లాదేశ్ తొలి ప్రాక్టీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఈ మ్యాచ్‌లోనైనా సరైన ప్రాక్టీస్ దక్కాలని బంగ్లా ఆటగాళ్లు ఆశిస్తున్నారు. 

  • మ్యాచ్ వివరాలు: భారత్ vs బంగ్లాదేశ్
  • వేదిక: నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్
  • తేదీ, సమయం: జూన్ 1న రాత్రి 8 గంటలకు.
  • టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్
  • డిజిటల్: డిస్నీ + హాట్‌స్టార్ యాప్

భారత జట్టు: రోహిత్ శ‌ర్మ(కెప్టెన్), య‌శ‌స్వి జైస్వాల్, సూర్యకుమార్ యాద‌వ్, విరాట్ కోహ్లీ, రిష‌భ్ పంత్(వికెట్ కీప‌ర్), సంజూ శాంస‌న్(వికెట్ కీప‌ర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, ర‌వీంద్ర జ‌డేజా, అక్షర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్, య‌జ్వేంద్ర చాహ‌ల్, అర్ష్‌దీప్ సింగ్, జ‌స్ప్రీత్ బుమ్రా, సిరాజ్‌.

రిజర్వ్ ప్లేయర్స్: శుభ్ మాన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్. 

బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తస్కిన్ అహ్మద్, లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహమ్మదుల్లా, జాకర్ అలీ, తన్వీర్ ఇస్లాం, షేక్ మహేదీ హసన్, రిషాద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్. 

రిజర్వ్ ప్లేయర్స్: అఫీఫ్ హుస్సేన్, హసన్ మహ్మద్.