బైక్ లోన్ ఆఫర్ : ఒక రూపాయి డౌన్ పేమెంట్ మాత్రమే

బైక్ లోన్ ఆఫర్ : ఒక రూపాయి డౌన్ పేమెంట్ మాత్రమే

ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ తన కష్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఫెడరల్ బ్యాంక్ లు వెయ్యికి పైగా ఉన్నాయి. ఈ బ్రాంచ్ లలో ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డ్ నుంచి కేవలం రూ. 1 చెల్లించి టూవీలర్లను సొంతం చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.

ఈ ఆఫర్ ను దేశం మొత్తంలో హీరో మోటో కార్ప్, హోండా మోటర్ సైకిల్, టీవీఎస్ మోటార్స్ షోరూం లలో సొంతం చేసుకోవచ్చని తెలిపింది. వాహనదారుడు రూపాయి చెల్లించి బండి తీసుకున్న అనంతరం మిగిలిన మొత్తాన్ని 3,6,9,12నెలల్లో ఈఎంఐ రూపంలో పే చేయాలని ఫెడరల్ బ్యాంక్ వెల్లడించింది.

ఈ ఆఫర్ కొనుగోలు దారులకు వర్తిస్తుందా లేదా అని తెలుసుకునేందుకు ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు ‘DC-SPACE-EMI’ అని టైప్ చేసి 5676762 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. అంతేకాదు 7812900900 నంబరుకు మిస్డ్‌కాల్ ఇచ్చి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. 500సీసీ ఇంజన్ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌లపై 17శాతం వడ్డీ రేటు అందిస్తున్నట్లు బ్యాంకు స్పష్టంచేసింది.

దీంతో పాటు ఫెస్టివల్ ఆఫర్ కింద ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డ్ ద్వారా హోండా మోటర్ సైకిల్ షోరూం లో టూవీలర్ ను కొనుగోలు చేస్తే..సదరు కొనుగోలు దారుడికి 5శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. కాగా దేశ వ్యాప్తంగా 36వేల షోరూంలలో ఫెడరల్ బ్యాంక్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఐటమ్స్ ను కొనుగోలు చేసేందుకు డెబిట్ కార్డ్ లపై ఈఎంఐ సౌకర్యాన్ని కల్పిస్తుంది.