సీబీఎస్‌ఈ సిలబస్‌ నుంచి ఫెడరలిజం, సెక్యూలరిజం తొలగింపు

సీబీఎస్‌ఈ సిలబస్‌ నుంచి ఫెడరలిజం, సెక్యూలరిజం తొలగింపు

న్యూఢిల్లీ: కరోనా క్రైసిస్ కారణంగాస్‌ స్టూడెంట్స్‌పై ఒత్తిడి పడకూడదనే ఉద్దేశంతో నేషనల్ ఎడ్యుకేషన్ బోర్డు సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ సిలబస్‌ నుంచి డెమోక్రటిక్ రైట్స్, ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా, ఫెడరలిజం, సిటిజన్‌షిప్ అండ్ సెక్యూలరిజం లాంటి చాప్టర్స్‌ను తొలగించింది. ఈ మేరకు మంగళవారం 2020–2021 ఎడ్యుకేషన్ ఇయర్‌‌కు మార్పు చేర్పులు చేసిన సిలబస్‌ను బోర్డు ప్రకటించింది.

అసాధారణ స్థితి నెలకొనడంతో మహమ్మారితో మొత్తం ప్రపంచం యుద్ధం చేస్తోందని, అందుకే సిలబస్‌లో మార్పులు చేశామని బోర్డు పేర్కొంది. గ్రేడ్ 9 నుంచి గ్రేడ్ 12 వారికి పొలిటికల్ సైన్స్‌ కోర్సులో ఎకనామిక్స్, పాలిటిక్స్‌ సబ్జెక్టుల్లో సిలబస్‌ను బోర్డు రివైజ్ చేశామని పేర్కొంది. క్లాస్ 11 వారి పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో ఫెడరలిజం, సిటిజన్‌షిప్, నేషనలిజం, సెక్యూలరిజం అంశాలను బోర్డు పూర్తిగా తొలిగించింది. లోకల్ గవర్నమెంట్‌లో కేవలం రెండు యూనిట్స్‌ను మాత్రమే డిలీట్ చేసింది.