కమ్మ రాజ్యంలో కడప రెడ్లు మోషన్ పోస్టర్

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు మోషన్ పోస్టర్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో  సంచలన చిత్రాన్ని తీయబోతున్నారు. ఇటీవల దివంగత నటుడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసిన ఆయన తాజాగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’తో ముందుకు రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఏపీ రాజకీయాలపై ఈ చిత్రం ఉండబోతుందని తెలుస్తోంది. పోస్టర్ లో ఏపీకి చెందిన కొన్ని రాజకీయ పార్టీల జెండాలు కూడా ఉన్నాయి.ఈ చిత్రంలో చంద్రబాబు పోలికలున్న ఓ వ్యక్తి ప్రధాన పాత్రలో నటించబోతున్నాడని ఆర్జీవి ట్విటర్ లో తెలిపారు.

first look logo poster of KAMMA RAJYAMLO KADAPA REDDLU