హైదరాబాద్: హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు చేసింది. తనపై ఆరోపణలు చేసిన న్యాయవాది సుభా సింగబోష్‌పై మంగ్లీ ఫిర్యాదు చేయడం గమనార్హం. 150 కోట్లకు మోసం చేశారంటూ తనపై సుభా సింగబోష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. మార్చి 21న సుభా సియపోగు పేరుతో తనను పరిచయం చేసుకున్న వ్యక్తి బెదిరించాడని మంగ్లీ ఫిర్యాదులో తెలిపింది. అమర్యాదగా బెదిరించే ధోరణిలో మాట్లాడారని తెలిపింది. తనను కలవాలని ఒత్తిడి చేశాడని, నిరాకరిస్తే అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో మంగ్లీ పేర్కొంది.
మరో వ్యక్తితో కలిసి అవమానకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించింది. తనకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్లు ఉన్న వీడియో చూపించి బెదిరించారని మంగ్లీ ఫిర్యాదులో తెలిపింది. సుభా సింగబోష్ తీరుపై తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని ఫిర్యాదులో మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో సుభా సింగబోష్‌పై BNS సెక్షన్లు 79, 351(3) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read ; రజనీకాంత్ 'జైలర్ 2' లో పవన్ కళ్యాణ్?
సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడిపై పంజాగుట్ట పీఎస్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10 కోట్ల మోసం చేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. సింగర్ మంగ్లీతో పాటు అతని సోదరుడు, మరో ముగ్గురిపై పంజాగుట్ట పీఎస్లో కేసు నమోదైంది. మంగ్లీతో ప్రాణహాని ఉందని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ సెక్షన్ 351(2), 352 కింద కేసు నమోదు చేశారు. మంగ్లీతో పాటు సోదరుడు అతని గ్యాంగ్ బెదిరింపులు పాల్పడ్డారని న్యాయవాది సుబ్బారావు పోలీసులను ఆశ్రయించాడు. తనను యాక్సిడెంట్ చేసి చంపుతామని బెదిరించారని సుబ్బారావు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మంగ్లీ, శివ, వేణు ఉడుగుల, ఇతరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
