ఇస్రో సంక్షోభం : మీరు రాజీనామా చేసినా.. మేం పంపించేది లేదు

ఇస్రో సంక్షోభం : మీరు రాజీనామా చేసినా.. మేం పంపించేది లేదు

ఇస్రోలో రాజీనామాల పర్వానికి చెక్ పెట్టింది కేంద్రం. ఇక నుంచి ఉద్యోగులను వదులుకునేది లేదని తేల్చి చెప్పింది. మీరు రాజీనామా చేసినా.. మేం అంగీకరించం.. మిమ్మల్ని ఇస్రో నుంచి పంపించేది లేదు అంటూ స్పష్టం చేసింది. ఆరు నెలల్లోనే 100 మంది శాస్త్రవేత్తలు రాజీనామా చేయటంపై మేల్కొన్న కేంద్ర ప్రభుత్వం.. ఇక నుంచి రాజీనామాల ఆమోదం లేదని.. ఉద్యోగులు ఎవర్నీ పంపించేది లేదని.. ఇస్రోలోనే ఉండాలంటూ స్పష్టం చేసింది.

గగన్ యాన్ వంటి కీలక మిషన్ లలో పనిచేస్తున్న ఇంజినీర్ల రాజీనామాను ఆమోదించవద్దని కేంద్రం ఇస్రోకు సూచించింది. వాలంటరీ రిటైర్మెంట్ ను కూడా ఆమోదించవద్దని ఆదేశాలు జారీ చేసింది. 

ALSO READ : భవిష్యత్ అంతా హైడ్రోజన్‎దే..

 దేశంలోని వివిధ పరిశోధన కేంద్రాలలో వందకు  పైగా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు రాజీనామా చేసినట్లు సమాచారం  వచ్చిన క్రమంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

వాలంటరీ రిటైర్మెంట్ కు అప్లై చేసుకున్న సైంటిస్టుల  సంస్థ కచ్చితగా  విడుదల చేయనప్పటికీ, కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న యుఆర్ రావు ఉపగ్రహ కేంద్రం (URSC) నుండి 80 మందికి పైగా శాస్త్రవేత్తలు , కేరళలోని తిరువనంతపురంలో ఉన్న విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (VSSC) నుండి సుమారు 20 మంది బయటకు వెళ్లిపోయిన్నట్లు తెలుస్తోంది. 

సామూహిక రాజీనామాలను అంగీకరిస్తూ, ఈ సమస్యలను ఎదుర్కోవడానికి అంతరిక్ష సంస్థ సిద్ధంగా ఉందని ఇస్రో ఛైర్మన్ వి. నారాయణ  తెలిపారు.