ఇండియన్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్షన్ ! పూర్తి వివరాలు ఇవే!

ఇండియన్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్షన్ ! పూర్తి వివరాలు ఇవే!

ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్లో దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 8న ప్రారంభమై ఏప్రిల్ 28న ముగుస్తుంది. 

పోస్టు పేరు: స్పెషలిస్ట్ ఆఫీసర్, 

మొత్తం ఖాళీలు: 350.

విభాగాల వారీగా ఖాళీలు: మేనేజర్ - డీసీ ఆపరేషన్స్ 4, మేనేజర్ - ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆపరేషన్స్ 3, మేనేజర్ - డీబీఏ 5, మేనేజర్ - నెట్ వర్క్ ఆపరేషన్స్ 3, మేనేజర్ - అప్లికేషన్ డెవలపర్ 3, మేనేజర్ - ఏపీఐ డెవలపర్ 4, మేనేజర్ డేటా అనలిస్ట్ 3, మేనేజర్ - చార్టెడ్ అకౌంటెంట్ 10, సీనియర్ మేనేజర్ - క్రెడిట్ 20, మేనేజర్ - క్రెడిట్ - 80, సీనియర్ మేనేజర్ - ఫైనాన్స్ 20, మేనేజర్ - ఫైనాన్స్ 80, సీనియర్ మేనేజర్ -ఫైనాన్షియల్ అనలిస్ట్ 10, మేనేజర్ - ఫైనాన్షియల్ అనలిస్ట్ - 40. సీనియర్ మేనేజర్ - మోడల్ వ్యాలిడేటర్ 4,  సీనియర్ మేనేజర్ - ఐటీ రిస్క్ మేనేజ్మెంట్ 1, సీనియర్ మేనేజర్ - డేటా అనలిస్ట్ 2, సీనియర్ మేనేజర్ - రిస్క్ మేనేజ్మెంట్, సీనియర్ మేనేజర్ క్లైమేట్ రిస్క్ 2, సీనియర్ మేనేజర్ ఫారెక్స్ డీలర్ 4. సీనియర్ మేనేజర్ ఫారెక్స్ డీలర్ (క్రాస్ కరెన్సీ) 1, సీనియర్ మేనేజర్ డొమెస్టిక్ డీలర్ 1, సీనియర్ మేనేజర్ డొమెస్టిక్ డీలర్ ఈక్విటీ ఎంఎఫ్ఎస్ 1, సీనియర్ మేనేజర్ డొమెస్టిక్ డీలర్ -ఎస్ఎస్ఎల్ఆర్ 1, సీనియర్ మేనేజర్ డొమెస్టిక్ డీలర్ -ఎస్ఎల్ఆర్ 1, మేనేజర్ -హెల్త్ మేనేజ్ మెంట్ 5, మేనేజర్ -హెర్ 10, మేనేజర్ మార్కెటింగ్ 10, అసిస్టెంట్ మేనేజర్ - సెక్యూరిటీ 10, అసిస్టెంట్ మేనేజర్ - సివిల్ ఇంజినీర్ 4, అసిస్టెంట్ మేనేజర్ ఆర్కిటెక్ట్ 1, 

 ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, బీఈ/ బి.టెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంసీఏ/ ఎంఎస్సీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎఫ్ఎ పూర్తిచేసిఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 37 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా,

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 08, 

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175. 

లాస్ట్ డేట్ : ఏప్రిల్ 28, 

 సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్ సైట్  indianbank. bank.in ను సందర్శించండి.