పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘ఫౌజీ’ (FAUZI) ఒకటి. ‘సీతారామం’తో ప్రేమకథను కొత్తగా చూపించిన దర్శకుడు హను రాఘవపూడి.. ఈసారి ప్రభాస్‌తో ఏకంగా 1940ల కాలానికి తీసుకెళ్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రభాస్ లుక్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్‌లో రిలీజ్ కానున్న సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే, ఫౌజీ కోసం కాచుకుని కూర్చున్న అభిమానులకు ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ రివీల్ చేశారు నిర్మాత. ఇదే టైంలో సినిమాపై అంచనాలు మరింత పెంచేలా గుడ్ న్యూస్‌ను కూడా నిర్మాత మైత్రి రవి శంకర్ అందించారు. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి? ఫ్యాన్స్ ను బాధపెట్టే ఆ బ్యాడ్ న్యూస్ ఏంటనేది తెలుసుకుందాం..
డిసెంబర్ 3న ‘ఫౌజీ’ కష్టమే..
ఇటీవలే మేకర్స్ ‘ఫౌజీ’ డిసెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ అనుకున్న తేదీకి సినిమా థియేటర్లలోకి రావడం లేదని నిర్మాత వై. రవి శంకర్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. నాని ‘ది ప్యారడైజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన.. సినిమా కొద్దిగా ఆలస్యమవుతుందని, అందుకు ప్రభాస్ ఫ్యాన్స్ క్షమించాలని తెలిపారు. కొత్త రిలీజ్ డేట్‌ను మాత్రం ఇంకా అనుకోలేదని తెలిపారు.
ఎందుకు లేట్ అవుతోంది?
‘ఫౌజీ’ సాధారణ కమర్షియల్ సినిమా కాదు. ఇది భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా. 1940ల బ్రిటిష్ ఇండియా, రెండో ప్రపంచ యుద్ధ కాలం నేపథ్యంలో కథ సాగుతుంది. ఇలాంటి సినిమాకు భారీ సెట్స్, యాక్షన్ బ్లాక్స్‌తో పాటు CGI, VFX, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కీలకం. అందుకే సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా తొందరపడకుండా మరింత సమయం తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
अज्ञातपर्व ENDS.
— Fauzi (@FauziTheMovie) July 16, 2026
THE REBELLION BEGINS 🔥#Fauzi GRAND RELEASE WORLDWIDE ON 3rd DECEMBER 2026 ❤️🔥#FauziOnDec3
Rebel Star #Prabhas#Imanvi @hanurpudi #MithunChakraborty #JayaPrada @AnupamPKher @Composer_Vishal @sudeepdop @kk_lyricist @MrSheetalsharma @rckamalakannan… pic.twitter.com/IUQaZLPb2Y
ప్రభాస్‌ను అలాంటి లుక్‌లో చూడలేదు!
రిలీజ్ డేట్ వాయిదా.. ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ కలిగించినా.. నిర్మాత రవి శంకర్ చెప్పిన మాటలు మాత్రం ఫ్యాన్స్‌కు కొత్త ఎనర్జీ ఇచ్చాయి. “ఫౌజీ కొద్దిగా వాయిదా పడుతోంది.. సారీ. కానీ ఇది నెక్స్ట్ లెవెల్ మూవీ. బాహుబలి తర్వాత ప్రభాస్ అన్నను ఇంత గ్రాండ్‌గా మీరు చూసి ఉండరు. కొంచెం వెనక్కి వెళ్తున్నాం.. కానీ ఈ సినిమాను మీరు లైఫ్ లాంగ్ చెరీష్ చేస్తారు” అనే అర్థంలో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే రిలీజ్ ఆలస్యం కావడం వెనుక కారణం సినిమా స్కేల్, విజువల్స్‌పై మేకర్స్ తీసుకుంటున్న అదనపు జాగ్రత్తగా కనిపిస్తోంది.
అసలు ‘ఫౌజీ’ కథ ఏంటి?
కథ మొత్తాన్ని మేకర్స్ ఇప్పటికీ సీక్రెట్‌గానే ఉంచుతున్నారు. అయితే ఇప్పటివరకు దర్శకుడు హను రాఘవపూడి వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘ఫౌజీ’ 1940ల బ్రిటిష్ కాలం నేపథ్యంలో సాగే ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా. ప్రభాస్ ఇందులో ఓ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రకు అజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంతో లింక్ ఉన్నట్లు ఇప్పటికే వెల్లడైంది.
హను రాఘవపూడి ప్రభాస్ పాత్రను రూపొందించే సమయంలో అర్జునుడు, కర్ణుడు, ఏకలవ్యుడు వంటి మహాభారత పాత్రలలోని విభిన్న కోణాలను స్ఫూర్తిగా తీసుకున్నట్లు గతంలో తెలిపారు. ముఖ్యంగా ప్రతిభ, త్యాగం, విధేయత వంటి లక్షణాలను ప్రభాస్ పాత్రలో మిళితం చేసినట్లు చెప్పారు. అయితే ఇవి సినిమా కథకు నేరుగా అదే పాత్రలు ఉంటాయని అర్థం కాదు.
ప్రేమ.. యుద్ధం.. త్యాగం..!
హను రాఘవపూడి సినిమాల్లో కథకు భావోద్వేగాన్ని జోడించే స్టైల్ ప్రత్యేకం. ‘ఫౌజీ’ కూడా కేవలం వార్ యాక్షన్ మూవీగా కాకుండా.. ఆ కాలానికి చెందిన మానవ సంబంధాలు, ఎమోషన్స్, త్యాగం, దేశభక్తి వంటి అంశాలను టచ్ చేసే కథగా రూపొందుతున్నట్లు సమాచారం. దర్శకుడు స్వయంగా తన వ్యక్తిగత అనుభవాల నుంచి కొన్ని అంశాలు ఈ కథను ప్రభావితం చేశాయని గతంలో వెల్లడించారు.
హీరోయిన్‌గా సోషల్ మీడియా బ్యూటీ, డ్యాన్సర్ ఇమాన్వి నటిస్తోంది. ప్రభాస్–ఇమాన్వి కాంబినేషన్ ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ తదితర సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
రెండు భాగాలుగా ‘ఫౌజీ’!
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ‘ఫౌజీ’ని ఒకే సినిమాగా ముగించకుండా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు హను రాఘవపూడి ఇప్పటికే ప్రకటించారు. మొదటి భాగంలో ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఒక ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తామని, రెండో భాగం మరో కోణాన్ని చూపిస్తుందని దర్శకుడు చెప్పారు. అంతేకాదు.. రెండో భాగం ప్రీక్వెల్‌గా ఉండనుందని కూడా వెల్లడించారు. అంటే మొదటి భాగంలో కనిపించే ప్రపంచం, పాత్రల వెనుక ఉన్న మరో కథను రెండో భాగంలో చూపించే అవకాశం ఉంది.
షూటింగ్ కూడా భారీ స్కేల్‌లో..
‘ఫౌజీ’ షూటింగ్ విషయంలో కూడా మేకర్స్ భారీగానే ప్లాన్ చేశారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 1940ల కాలానికి చెందిన జపనీస్ ఆర్మీ క్యాంప్‌ను ప్రత్యేకంగా సెట్ వేసి కీలకమైన వరల్డ్ వార్-2 నేపథ్య సన్నివేశాలను చిత్రీకరించినట్లు రిపోర్టులు వచ్చాయి. ఆ కాలం నాటి వాతావరణం, సైనిక క్యాంప్, ప్రొడక్షన్ డిజైన్‌ను చాలా వివరంగా రీక్రియేట్ చేసినట్లు సమాచారం.
ఇక షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసేందుకు ఒక దశలో మూడు యూనిట్లు పనిచేసినట్లు రిపోర్టులు వచ్చాయి. ప్రభాస్‌కు సంబంధించిన కీలక ఎపిసోడ్లను హను రాఘవపూడి పర్యవేక్షించగా.. మిగిలిన భాగాలను ఇతర యూనిట్లు పూర్తి చేసినట్లు సమాచారం.
ప్రభాస్ కెరీర్‌లో మరో పీరియడ్ సినిమా..
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ భారీ స్థాయి సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ‘ఫౌజీ’తో మరోసారి పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో కనిపించబోతున్నాడు. అయితే ‘బాహుబలి’ తరహా ఫాంటసీ ప్రపంచం కాకుండా.. 1940ల చరిత్ర, యుద్ధ వాతావరణం, సైనికుడి జీవితం, భావోద్వేగాలతో కూడిన భిన్నమైన ప్రపంచాన్ని హను రాఘవపూడి క్రియేట్ చేస్తున్నారు. అందుకే నిర్మాత రవి శంకర్ చెప్పిన “బాహుబలి తర్వాత ప్రభాస్‌ను ఇంత గ్రాండ్‌గా చూడలేదు” అనే మాట ఇప్పుడు ఫ్యాన్స్‌లో మరింత హైప్ పెంచుతోంది.
కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు?
ప్రస్తుతం ‘ఫౌజీ’కి కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. డిసెంబర్ 3 రేసు నుంచి సినిమా తప్పుకోవడం మాత్రం కన్ఫర్మ్ అయింది. దీంతో కొత్త తేదీపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రిలీజ్ కొంచెం లేట్ అయినా.. ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని ఒక కొత్త పీరియడ్ అవతార్‌లో చూపించడమే లక్ష్యంగా హను రాఘవపూడి టీమ్ పనిచేస్తుండటంతో.. ‘ఫౌజీ’పై అంచనాలు మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా రెండు భాగాల కథ, 1940ల వార్ బ్యాక్‌డ్రాప్, భారీ యాక్షన్, ప్రభాస్ సోల్జర్ లుక్.. ఇవన్నీ కలిపి ఈ సినిమాను ప్రభాస్ కెరీర్‌లో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా మార్చేలా కనిపిస్తున్నాయి.
Before freedom became a celebration, it was a battle!
— Fauzi (@FauziTheMovie) August 15, 2026
Saluting the spirit of every Fauzi who fought for our tomorrow 🙏🏼
Happy Independence Day 🇮🇳
– Team #FAUZI#Fauzi GRAND RELEASE WORLDWIDE ON 3rd DECEMBER 2026 ❤️🔥#FauziOnDec3
Rebel Star #Prabhas#Imanvi @hanurpudi… pic.twitter.com/1jTbifIcQB
