రజనీకాంత్ 'జైలర్ 2' లో పవన్ కళ్యాణ్? తలైవాతో పవర్ స్టార్ మెగా కాంబో!

రజనీకాంత్ 'జైలర్ 2' లో పవన్ కళ్యాణ్? తలైవాతో పవర్ స్టార్ మెగా కాంబో!

సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన 'జైలర్' ప్రభంజనం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం 'జైలర్ 2'. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేశాయి.  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే  మూవీ గురించి వస్తున్న వార్తలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.  

షారుఖ్ ఖాన్ స్థానంలో పవర్ స్టార్?

ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం మొదట బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పేరు గట్టిగా వినిపించింది. రజనీ, షారుఖ్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు. అయితే, లేటెస్ట్ సమాచారం ప్రకారం షారుఖ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. తన తదుపరి చిత్రం ‘కింగ్’ షూటింగ్ షెడ్యూల్స్ వల్ల డేట్స్ సర్దుబాటు కాకపోవడమే దీనికి ప్రధాన కారణమని సమాచారం..

అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. షారుఖ్ వదులుకున్న ఆ శక్తివంతమైన పాత్ర కోసం మేకర్స్ ఇప్పుడు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే, రజనీకాంత్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌ వెండితెరపై ఒక మెగా విజువల్ ఫీస్ట్‌గా మారుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ క్రేజీ పాత్రపై ఆయన నిర్ణయం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.

భారీ తారాగణం.. 

'జైలర్ 2'లో ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ మళ్ళీ తన విశ్వరూపం చూపించబోతున్నారు. మొదటి భాగంలో మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ చేసిన పాత్రలు ఈ సినిమా స్థాయిని పెంచగా, రెండో భాగంలో మరిన్ని సర్ప్రైజ్‌లు ఉండబోతున్నాయి. మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ ఈ సీక్వెల్‌లోనూ కనిపించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్, ఎస్.జె. సూర్య , సూరజ్ వెంజారమూడు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

రజనీకాంత్ లైనప్..

ప్రస్తుతం రజనీకాంత్ వరుస సినిమాలతో ఫుల్ జోరులో ఉన్నారు.  కేవలం 'జైలర్ 2' మాత్రమే కాదు.. తన రాబోయే ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తలైవర్ 171 (కూలీ 2) లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సిబి చక్రవర్తి దర్శకత్వంలో ఒక ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్‌కు రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

అంతే కాకుండా సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత రజనీకాంత్ - కమల్ హాసన్ కలిసి ఒక ప్రాజెక్ట్ (KHxRK) చేయబోతున్నారు. ప్రస్తుతం 'జైలర్ 2'లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుందా లేదా అనే విషయంపై అధికారిక ప్రకటన వస్తే తప్ప క్లారిటీ రాదు. కానీ, ఈ ఊహే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.