Dacoit Box Office : బాక్సాఫీస్ వద్ద 'డెకాయిట్' వేట.. తొలి రోజు ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే?

Dacoit Box Office : బాక్సాఫీస్ వద్ద 'డెకాయిట్' వేట.. తొలి రోజు ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్'.  భారీ అంచనాల మధ్య నిన్న ( ఏప్రిల్ 10న ) రిలీజ్ అయిన  ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఆరంభాన్ని అందుకుంది.  డైరెక్టర్ షనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సఫలమైంది. 

తొలిరోజు వసూళ్ల ఎంతంటే?

సినీ ట్రెడ్ లెక్కల ప్రకారం.. 'డెకాయిట్' తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 13.57 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇండియాలో రూ. 7.57 కోట్ల రాబట్టింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా శేష్ మేనియా కనిపించింది, అక్కడ ఈ చిత్రం రూ. 6.00 కోట్లను కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.50 కోట్ల గ్రాస్ రాబట్టింది.  కర్ణాటకలో రూ. 80 లక్షలు, తమిళనాడు- కేరళలో కలిసి రూ. 17 లక్షలు, మిగత చోట్ల రూ. 1.10 కోట్లు  వరకు వసూళ్లు చేసింది. తెలుగు వెర్షన్ 41 శాతం ఆక్యుపెన్సీతో రూ. 5.60 కోట్ల నెట్ సాధించగా, హిందీ వెర్షన్ 12 శాతం ఆక్యుపెన్సీతో రూ. 90 లక్షలను రాబట్టింది.

అసలు కథేంటి? 

 'డెకాయిట్' కథాంశం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. జైలు నుంచి తప్పించుకున్న ఒక హత్య నేరస్తుడు, తన మాజీ ప్రేయసిపై పగ తీర్చుకోవడమే లక్ష్యంగా ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ఈ క్రమంలో జరిగే ఊహించని పరిణామాలు, మలుపులు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయి. ఏది తప్పు? ఏది ఒప్పు? అనే సందిగ్ధంలో సాగే ఈ ప్రయాణం క్లైమాక్స్ వరకు ఉత్కంఠను రేపుతుంది.

ALSO READ : ఓటీటీలోకి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ ‘యూత్’..

అడివి శేష్‌తో మృణాల్ కెమిస్ట్రీ..

ఈ సినిమాలో అడివి శేష్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నారు. సినిమాలో స్టైలిష్‌గా కనిపిస్తూనే, భావోద్వేగ సన్నివేశాల్లోనూ రాణించారు. మృణాల్ ఠాకూర్ తన పాత్ర పరిధి మేరకు అద్భుతమైన నటనను కనబరిచారు. అడివి శేష్‌తో ఆమె కెమిస్ట్రీ స్క్రీన్ పై ఫ్రెష్‌గా ఉంది. ఒక విలక్షణమైన పోలీస్ ఆఫీసర్‌గా అనురాగ్ కశ్యప్ కొత్త లుక్‌లో కనిపించారు. అయితే ఆయన పాత్ర కొంత మేర హాస్యాస్పదంగా అనిపించినా, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని టాక్ వినిపిస్తోంది. ఇక సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తన అనుభవాన్ని జోడించినా, ఆయన పాత్రలో కొత్తదనం పెద్దగా లేదనిపిస్తుంది.

ఎలా ఉందంటే?

భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ, నేపథ్య సంగీతం యాక్షన్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. సినిమాలో కొన్ని ట్విస్టులు, ముఖ్యంగా క్లైమాక్స్ షాకింగ్‌గా ఉంటుంది. అయితే, కథనం కొంత నెమ్మదించడం, కొన్ని లాజిక్ లేని సీన్లు సినిమాకు మైనస్‌గా మారాయి. ప్రస్తుతం నడుస్తున్న 'ఆల్ఫా మేల్' యాక్షన్ ట్రెండ్‌ను ఈ సినిమా ఫాలో అయినట్లు కనిపిస్తుంది. విమర్శకుల నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, మాస్ ఆడియన్స్‌ను అలరించే అంశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు సినీ అభిమానులు. మొత్తానికి 'డకోయిట్' బాక్సాఫీస్ వద్ద మంచి స్పీడ్‌తో దూసుకెళ్తోంది.  ఈ వీకెండ్ ముగిసే సమయానికి ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : అఫీషియల్.. ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్