Ustaad Bhagat Singh OTT: అఫీషియల్.. ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Ustaad Bhagat Singh OTT: అఫీషియల్.. ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన రీసెంట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో ఉగాది కానుకగా (మార్చి 19, 2026) థియేటర్లలోకి వచ్చిన మూవీ ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్లో ఈ చిత్రం ఏప్రిల్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది...

ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్:  

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్-పవన్ కళ్యాణ్ కాంబోలో మూవీ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. మిశ్రమ స్పందనను అందుకుంది. ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఈ క్రమంలోనే మూవీ కేవలం నెల రోజుల లోపే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. థియేటర్ బాక్సాఫీస్‌లో నిరాశపరిచిన ఉస్తాద్.. ఓటీటీలో అదృష్టం పరీక్షించుకోనుంది. 

కథ:

నల్లమల సమీపంలోని ఓ గూడెంలో మాస్టారు చంద్రశేఖర్ రావు (కె. ఎస్. రవికుమార్) పిల్లలకు పాఠాలు చెబుతుంటారు. వారిలో చైతన్యం తీసుకురావడానికి తన జీవితాన్ని అంకితం చేస్తాడు. అక్కడే అనాథగా ఉన్న చిన్నయ్యను దత్తత తీసుకుని చదువు చెప్పి, అతనికి “భగత్ సింగ్” అని పేరు పెడతాడు. పెద్దయ్యాక ఆ బాలుడు ఏసీపీగా (పవన్ కళ్యాణ్) ఎదిగి మంచి గుర్తింపు పొందుతాడు.

►ALSO READ | Youth OTT: ఓటీటీలోకి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ ‘యూత్’.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్

ఈ క్రమంలోనే అడవిలో పాఠాలు చెప్పే మాస్టారు రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టి సీఎం అవుతారు. అనూహ్యంగా అతని ప్రాణాలు చిక్కులో పడతాయి.  అసాంఘిక శక్తులతో ఉన్న నల్లనాగప్ప (Parthiban) ముఖ్యమంత్రిని లేపేయాలని ఫిక్స్ అవుతాడు. ఇక తన గురువును కాపాడే బాధ్యత ఉస్తాద్ తీసుకుంటాడు. 

మరి ఉస్తాద్ భగత్ సింగ్ తన గురువును ఎలా రక్షించాడు? నల్లనాగప్పతో పోరాటం ఎలా సాగింది? అతని జీవితంలోకి వచ్చిన లీల (శ్రీలీల), శ్లోక (రాశీ ఖన్నా) పాత్రలు ఏమిటి? అన్నదే మిగతా కథ.