తమిళ వర్సటైల్ యాక్టర్ కరుణాస్ తనయుడు కెన్ కరునాస్ హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేసిన మూవీ ‘యూత్’ (Youth). మార్చి 26, 2026న తెలుగులో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం 23 ఏళ్ల వయసులోనే హీరోగా, దర్శకుడిగా మెప్పించిన కెన్ కరుణాస్ ఇండస్ట్రీలో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని కేవలం 53 రోజుల్లో పూర్తి చేసి హిట్ సాధించడం విశేషం.
కాలేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలనుకునే యూత్, మిడిల్ క్లాస్ పేరెంట్స్ వాళ్లపై పెట్టుకున్న నమ్మకాల నేపథ్యంలో మూవీ తెరకెక్కింది. దర్శకుడిగా కెన్ కరుణాస్ నటీనటుల నుంచి సహజమైన నటనను రాబట్టడంలో విజయం సాధించారు. ముఖ్యంగా సెకండ్ పార్ట్లో సూరజ్ వెంజరమూడు, దేవదర్శినిల నటన చిత్రానికి హైలైట్‌గా నిలిచింది.
యూత్ ఓటీటీ:
తమిళ నటుడు-దర్శకుడు కెన్ కరునాస్ తెరకెక్కించిన ‘యూత్’ మూవీ ఓటీటీకి సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన దాదాపు నెల రోజులకు, ఈ కామెడీ ఎంటర్‌టైనర్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఏప్రిల్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మార్చి 26న విడుదలైన ఈ చిత్రం, హైస్కూల్ విద్యార్థి ప్రవీణ్ (కెన్ కరుణాస్) జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కింది. తన తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చేందుకు చదువులో మెరుగుపడాలని ప్రయత్నిస్తూ, ప్రేమ మరియు యౌవన దశలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే కథగా ఇది రూపొందింది.
ఈ చిత్రంలో అనీష్మా అనిల్‌కుమార్, మీనాక్షి దినేష్, ప్రియాంషి యాదవ్ కథానాయికలుగా నటించగా, అబిసన్ తేవరసా, కరెన్ విన్సెంట్, దేవదర్శిని, సూరజ్ వెంజరమూడు కీలక పాత్రలు పోషించారు.
►ALSO READ | Netflix Cinema: క్లైమేట్ కథల కోసం స్క్రిప్ట్‌రైటింగ్ ల్యాబ్.. యంగ్ రైటర్స్‌కు నెట్‌ఫ్లిక్స్ గోల్డెన్ ఛాన్స్!
ఇప్పటికే ‘అసురన్’, ‘సార్’, ‘విడుదలై పార్ట్ 2’ వంటి చిత్రాల్లో గుర్తింపు పొందిన కెన్ కరుణాస్, ఈ సినిమాతో హీరోగా, దర్శకుడిగా సక్సెస్ సాధించారు. థియేటర్లలో విడుదలైన 22 రోజుల్లోనే ఇండియాలో రూ.50 కోట్లకు పైగా నెట్, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 70 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
Ada ennada ithu kaadhaluku vandha sodhanai? 🤭💔 pic.twitter.com/gJHkSEqa9N
— Netflix India South (@Netflix_INSouth) April 11, 2026
‘యూత్’ కథ:
మధ్యతరగతి కుర్రాడు ప్రవీణ్ (Ken Karunas) అల్లరి కుర్రాడు. అతనివైపు స్కూల్ లో ఏ అమ్మాయి కన్నెత్తి చూడదు. అయినప్పటికీ స్కూల్ లైఫ్ పూర్తయ్యేలోపే ఒక అమ్మాయిని ప్రేమించాలని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలోనే గంగవల్లి, ప్రేషిక, సోనాల్ అనే అమ్మాయిలు తన లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తారు.
వారి రాక అతని జీవితాన్ని మలుపుతిప్పుతాయి. లవ్, బ్రేకప్‌లు, అవమానాలు అన్నీ ఎదుర్కొంటాడు. వీటి మధ్య ప్రవీణ్ లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ ప్రయాణంలో తల్లిదండ్రుల కలల్ని నెరవేర్చాడా? లేదా? అన్నదే మిగతా కథ.
