మానవత్వమా.. అదెలా ఉంటది..? అసలే ఎండలు మండిపోతున్నయ్.. దొరికినన్ని కొబ్బరి బోండాలు దోచుడే !

మానవత్వమా.. అదెలా ఉంటది..? అసలే ఎండలు మండిపోతున్నయ్.. దొరికినన్ని కొబ్బరి బోండాలు దోచుడే !

మానవత్వం. మనుషుల్లో ఈ మంచి గుణం చూద్దామన్నా కానరాని రోజుల్లో మనం బతుకుతున్నాం. ఎవడెలా పోయినా పర్లేదు.. మనం మంచిగుంటే చాలనే మనస్తత్వాలు పెరిగిపోయిన రోజులివి. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటన మరోసారి ఈ విషయాన్ని రుజువు చేసింది. మధ్యప్రదేశ్లోని దహోడ్ ప్రాంతంలో ఒక వంతెన దగ్గర కొబ్బరి బోండాల లోడ్తో వెళుతున్న లారీ తిరగబడింది. కొబ్బరి బోండాలు వంతెన పై నుంచి నీళ్లలో పడిపోయాయి. ఆ లారీలో ఉన్న వాళ్లను కాపాడాల్సిన జనం అది మానేసి కొబ్బరి బోండాల కోసం నీళ్లలో దిగి బస్తాలకు బస్తాలు తీసుకెళుతూ కనిపించారు.

ఆ లారీ డ్రైవర్ గురించి ఏ ఒక్కరూ ఆలోచించకపోవడం ప్రస్తుత సమాజ స్వార్థపూరిత మనస్తత్వానికి నిదర్శనం. గాయాలపాలైన ఆ డ్రైవర్ను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. కనీసం అతనికి ఎలా ఉందని కూడా కన్నెత్తి చూడలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘అతనెలా పోతే మాకేంటి.. అసలే ఎండా కాలం.. ఎండలు మండిపోతున్నయ్.. దొరికినన్ని కొబ్బరి బోండాలను దోచుకుని ఇంటికి పట్టుకుపోవాలి’.. అక్కడ కొబ్బరి బోండాలు దొంగతనం చేస్తున్న ప్రతీ ఒక్కరి మనస్తత్వం ఇలానే ఉంది. ఇలాంటి ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయం.

Also Read  :సముద్ర గర్భంలో మెగా గోల్డ్ ఫ్యాక్టరీ