‘హరే కృష్ణ’ ఇంటిగ్రేటెడ్ కిచెన్కు రూ.4 కోట్లు

‘హరే కృష్ణ’ ఇంటిగ్రేటెడ్ కిచెన్కు రూ.4 కోట్లు
  • సీఎస్సార్​ ఫండ్​ కింద రూ.10 కోట్లు ఇచ్చిన అరబిందో ఫార్మా మేనేజింగ్ ట్రస్టీ

కొడంగల్, వెలుగు: కొడంగల్​పట్టణంలోని హరే కృష్ణ మూవ్​మెంట్ చారిటబుల్​ఫౌండేషన్​ ఇంటిగ్రెటేడ్​సెంట్రలైజ్డ్ కిచెన్​ఆధునీకరణకు అరబిందో ఫార్మా ముందుకొచ్చింది. గురువారం సీఎం రేవంత్​రెడ్డిని కలిసిన ఫార్మా మేనేజింగ్ ట్రస్టీ నిత్యానంద రెడ్డి రూ.10 కోట్ల సీఎస్సార్ ఫండ్ కు సంబంధించిన చెక్కును అందజేశారు.

ఇందులో కొడంగల్ ఇంటిగ్రేటెట్​కిచెన్ కు రూ.4 కోట్లు వినియోగించనున్నట్లు ఫౌండేషన్​ప్రతినిధులు తెలిపారు. కొడంగల్ ఇంటిగ్రేటెట్ కిచెన్​ద్వారా వికారాబాద్, నారాయణపేట జిల్లాలోని 14 మండలాల్లో విద్యార్థులకు బ్రేక్​ఫాస్ట్, లంచ్​ అందిస్తున్నారు.