యువతను మత్తులో పడేసేందుకో లేక యువతలో ఉన్న అలవాట్లను క్యాష్ చేసుకునేందుకో కానీ.. కొందరు గంజాయి, కొందరు డ్రగ్స్, ఇంకొందరు ఈ-సిగరెట్లు అంటూ హైదరాబాద్ సిటీలో జోరుగా దందా సాగిస్తున్నారు. యూత్ ను మత్తులో ముంచి లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మందిని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ.. మరో ఈ-సిగరెట్ రాకెట్ బయటపడటం ఆందోళన కలిగించే అంశం. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
2026 ఏప్రిల్ 11 (శనివారం) హైదరాబాద్‌లో అక్రమ ఈ-సిగరెట్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. టాస్క్ ఫోర్స్, నాంపల్లి పోలీసుల సంయుక్త ఆపరేషన్ ముగ్గురు నిందితులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 34.03 లక్షల విలువైన ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. డెలివరీకి వెళ్తున్న సమయంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
డెలివరీ బాయ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ రాకెట్ ను ఛేదించారు. ప్రధాన సూత్రధారి ఇంటి దగ్గర భారీగా ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా బుకింగ్స్ తీసుకుని.. రాపిడో, పోర్టర్ ద్వారా డెలివరీలు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఢిల్లీ నుంచి పార్సిల్ ద్వారా సరఫరా అవుతున్నట్లు విచారణలో తేలింది. దీనిపై మరింత లోతైన దర్యాప్తు జరపనున్నట్లు చెప్పారు.
