తాడాట.. బరువు తగ్గిస్తది

తాడాట.. బరువు తగ్గిస్తది

స్కిప్పింగ్ (తాడాట). ఇది అందరికీ తెలిసిన వ్యాయామమే.. కానీ ఇది వ్యాయామంగా కంటే ఆటలాగే తెలుసు అందరికీ.చిన్నప్పుడు పోటీలు పెట్టు కుని మరీ స్కిప్పింగ్ ఆడేవాళ్లు . కానీ రానురాను ఈ ఆటను పూర్తిగా మర్చిపోయారు. అయితే స్కిప్పింగ్ చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలిస్తే మళ్లీ తాడు తీసి ఆట మొదలుపెడతారు. తాడాటని జంపింగ్ రోప్ ఎక్సర్‌ సైజ్ అంటారు. ఈ జంపింగ్ రోప్ వర్కవుట్స్‌‌‌‌లో మనకు తెలిసిన రెగ్యులర్ స్కిప్పింగ్‌‌‌‌తో పాటు ఇంకా చాలా రకాలున్నాయి. వాటిని రోజూ ప్రాక్టీస్ చేస్తే తక్కువ కాలంలోనే ఈజీగా బరువు తగ్గించుకోవచ్చంటున్నారు ఫిట్‌‌‌‌నెస్ ట్రైనర్ బాబీ.

సైడ్ టు సైడ్ జంప్

సైడ్ టు సైడ్ జంప్ రోప్ ఒక హై ఇంటెన్సి టీ కార్డియో ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్. ఈ వ్యాయామంలో.. స్ట్రైట్ జంపింగ్ చేస్తూనే కాళ్లను స్ట్రైట్‌‌‌‌గా కాకుండా ఫొటోలో చూపిన విధంగా కాస్త పక్కకు ల్యాండ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నడుము భాగం స్ట్రెచ్ అవుతుంది. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరు-గుతుంది. దీన్ని ఐదు నుంచి పది నిముషాలు చెయ్యొచ్చు.

 

 

 

 

 

 

క్రాస్ హ్యాండ్ జంప్ రోప్

క్రాస్ హ్యాండ్ జంప్ రోప్ కాస్త కష్టమై న వర్కవుట్. జంప్ రోప్ బాగా ప్రాక్టీస్ చేసే వాళ్లు, జంపింగ్ రోప్‌‌‌‌లో అనుభవం ఉన్నవాళ్లు దీన్ని ట్రై చేయొచ్చు. స్ట్రైట్ జంపింగ్ చేస్తూనే చేతులు క్రాస్ చేసి, రోప్‌‌‌‌ను ఆడించాలి. దీని కోసం ఎక్కువ హైట్ జంప్ చేయాల్సి ఉంటుం ది. ఇది కూడా హై ఇంటెన్సి టీ కార్డియో వ్యాయామమే. దీని వల్ల ఫుల్ బాడీ యాక్టివేట్ అవుతుంది.

 

 

 

 

 

స్ట్రైట్ జంప్  

స్కిప్పింగ్ అనగానే అందరూ చేసేది స్ట్రైట్ జంప్ స్కిప్పింగ్. నిటారుగా నిల్చొని, రెండు చేతులతో రోప్ రెండు చివర్లా పట్టు కోవాలి. తర్వాత రోప్ కాళ్ల వెనుక ఉంచి స్కిప్పింగ్ స్టార్ట్ చేయాలి. చేతులను మరీ ఎక్కువగా కదిలించకుండా

మణికట్టు సాయంతోనే తాడును ఆడించాలి. ఎగిరేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు కాళ్లపై ఒత్తిడి పడకుండా స్లోగా మునివేళ్లపై ల్యాండ్ అవ్వాలి. ఇలా ఐదు నుంచి పది నిముషాలు ఈ వ్యాయామం చేయాలి. దీనివల్ల టోటల్ బాడీకి ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్ అందుతుంది. ఇదొక మంచి కార్డియో ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్ కూడా.

 

 

 

 

సింగిల్ లెగ్ జంప్

సింగిల్ లెగ్ జంప్ అంటే ఒక్కో కాలితో స్కిప్పింగ్ చేయడం. ఇది కూడా చాలామందికి తెలిసిందే.. స్ట్రైట్ జంప్ కష్టం గా ఉన్నవాళ్లు సింగిల్ లెగ్ జంపింగ్ చేస్తుంటారు. తాడుని ఒక్కో కాలి కింద నుంచి పోనిస్తూ స్కిప్పింగ్ చేయాలి. దీనివల్ల కూడా టోటల్ బాడీ యాక్టివేట్ అవుతుంది. ఎక్కువ బరువు ఉన్నవాళ్లు, జంపింగ్ చేయడం కష్టం గా ఉన్నవాళ్లు సింగిల్ లెగ్ జంప్‌‌‌‌ను ఎంచుకోవచ్చు. దీన్ని ఐదు నుంచి పది నిముషాలు చెయ్యొచ్చు.

 

 

 

 

 

సింగిల్ హ్యాండ్ రోప్ జంప్

సింగిల్ హ్యాండ్ రోప్ జంప్ ఇంకా ఈజీగా చేసే ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్. రోప్‌‌‌‌ను ఒక చేత్తో పట్టు కుని రౌండ్‌‌‌‌గా తిప్పుతూ నిల్చున్న చోటనే గెంతాలి. మధ్యమధ్యలో రోప్‌‌‌‌ను చేతులు మారుస్తూ రిథమిక్‌ గా కూడా ఆడించొచ్చు. ఎక్కువ బరువు ఉన్న వాళ్లు జంపింగ్ రోప్స్‌‌‌‌ను ఈ వ్యాయామంతో మొదలు పెట్టొచ్చు. దీన్ని ఐదు నుంచి పది నిముషాలు చెయ్యొచ్చు.

 

 

 

 

 

 

లాభాలు

  • జంపింగ్ రోప్ వ్యాయామాల వల్ల మజిల్ గ్రోత్ పెరుగుతుంది. జంప్ చేసిన ప్రతీసారి బాడీలోని అన్ని మజిల్ గ్రూప్స్ యాక్టివ్ అవుతాయి. అందుకే దీనివల్ల ఫ్లెక్సి బిలిటీ కూడా బాగా పెరుగుతుంది.
  • ఇదొక మంచి కార్డియో ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్. ఆడుతూ పాడుతూ రోజుకో పది నిముషాలు స్కిప్పింగ్‌‌‌‌లో వెరైటీలు ప్రాక్టిస్ చేస్తే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
  • జంపింగ్ రోప్ వర్కవుట్స్‌‌‌‌తో మెదడు చురుకుగా మారుతుంది. ఈ వ్యాయామం బ్రెయిన్‌ లోని లెఫ్ట్, రైట్ హెమీస్పియర్స్‌‌‌‌ను బ్యాలెన్స్ చేస్తుంది.  దాని వల్ల మైండ్ షార్ప్ అయ్యి, రీడింగ్, మెమరీ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అన్నింటినీ మించి జంపింగ్ రోప్స్ చేస్తుంటే .. ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్ చేస్తు న్న ఫీలింగ్ కలగదు. చేసేం దుకు సరదాగా, ఈజీగా ఉంటుంది. గ్రూప్‌‌‌‌గా కలిసి చేసేందుకు కూడా ఇవి సులువుగా ఉంటాయి. ఇందులో ఉండే డిఫరెంట్ టైప్స్.. చేసేందుకు చాలెంజింగ్‌‌‌‌గా ఉంటాయి.
  • ఈ వ్యాయామాలు ఎవరైనా చేయొచ్చు.అయితే కొత్తగా స్టార్ట్​ చేసేవాళ్లు నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి. మంచి షూస్ వాడాలి. నేల మరీ గట్టిగా ఉండకుండా, రాళ్లు లాంటివి లేకుండా చూసుకోవాలి. మోకాళ్లు, అరికాళ్లు, వెన్నెముకలో నొప్పులు వస్తే వెంటనే ఆపేయాలి.
  • జంప్ చేసేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు కాళ్లు మొత్తం నేలకు ఆనించకూడదు. కాళ్లపై ఒత్తిడి పడకుండా నిదానంగా ల్యాండ్ అవ్వాలి.
  • జంపింగ్‌‌‌‌ రోప్‌‌‌‌ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌‌‌తో బరువు తగ్గడం కూడా చాలా ఈజీ. శరీరం మొత్తాన్ని యాక్టివ్ చేసే ఈ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌‌‌తో తక్కువ సమయంలోనే ఎక్కువ క్యాలరీలు కరిగించొచ్చు. జంపింగ్ రోప్‌‌‌‌తో గంటకు 1300 క్యాలరీలు బర్న్ అవుతాయి.
  • జంపింగ్ రోప్‌‌‌‌తో పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరిగించొచ్చు.ఈ వ్యాయామంతో భుజాలు, కాళ్లు బలంగా మారతాయి. రోజూ జంపింగ్‌‌‌‌ రోప్‌‌‌‌ ఎక్సర్‌‌‌‌సైజ్‌‌‌‌ చేస్తే, బాడీ బ్యాలెన్స్ బాగుంటుంది.
  • జంపింగ్ రోప్‌‌‌‌ వ్యాయామం వల్ల రక్త సరఫరా మెరుగవుతుంది. ఎముకలు గట్టిపడతాయి. చర్మంపై ఏర్పడిన ముడతలు పోతాయి.