మా తల్లీ బతుకమ్మ పోయి రావమ్మ

మా తల్లీ బతుకమ్మ  పోయి రావమ్మ

గునుగు, తంగేడు, బంతి, చామంతి.. తీరొక్క పూలతో రోజొక్క తీరుగా తొమ్మిదొద్దులు పల్లెలను, పట్నాలను బతుకమ్మ ఉయ్యాలలూపింది. గల్లీ గల్లీలో ఆడబిడ్డల ఆటపాటలతో నేలంతా మురిసిపోయింది. ‘ఎంగిలిపూల’తో మొదలైన పూలజాతర ఆదివారం ‘సద్దుల బతుకమ్మ’తో ముగిసింది. ‘‘పసుపుల పుట్టే గౌరమ్మ.. పసుపుల పెరిగే గౌరమ్మ.. పసుపుల వసంతమాడంగ.. పోయిరా గౌరమ్మ’’ అంటూ బతుకమ్మను ఆడబిడ్డలంతా గంగమ్మ ఒడికి చేర్చి.. వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నరు. మళ్లొచ్చే ఏడాదికి తిరిగొస్తానంటూ దీవెనార్తులు ఇస్తూ బతుకమ్మ సెలవుతీసుకుంది.