ఏనుగు మృతి ఘనటలో ఎవ్వరినీ వదలం

ఏనుగు మృతి ఘనటలో ఎవ్వరినీ వదలం
  • ముగ్గురు అనుమానితులను గుర్తించామన్న కేరళ సీఎం పినరయి విజయన్
  • కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోనూ దర్యాప్తు
  • దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆగ్రహావేశాలు

తిరువనంతపురం : కేరళలో పైనాఫిల్ లో పేలుడు పదార్థాలు పెట్టి గర్భంతో ఉన్న ఏనుగును పొట్టన బెట్టుకున్న సంఘటనపై ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వదిలేది లేదని తేల్చి చెప్పారు. దేశ వ్యాప్తంగా ఈ సంఘనటపై జనం వ్యక్తం చేస్తున్న ఆవేదనను అర్థం చేసుకోగలనని అన్నారు. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను గుర్తించామని , దర్యాప్తు కొనసాగుతుందని గురువారం వరుస ట్వీట్లు చేశారు. మలప్పురం జిల్లాలో ఈ ఘటన జరిగినట్టు మెహన కృష్ణ అనే ఫారెస్ట్ అఫీసర్ చెప్పారు. కానీ ఇది పాలక్కడ్ జిల్లాలో జరిగినట్లు కేరళ అధికారులు వివరణ ఇచ్చారు. ” ఎంక్వైరీ జరుగుతోంది. ముగ్గురు అనుమానితులను గుర్తించాం. పోలీసులు, ఫారెస్ట్ అధికారులు కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. జిల్లా పోలీసు, ఫారెస్ట్ చీఫ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితులను కఠినంగా శిక్ష పడేలా చేస్తాం” అని విజయన్ ట్వీట్ చేశారు. కేంద్ర పర్యావరణమంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ” నిందితులు తప్పించుకునేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వం. వారిని కచ్చితంగా శిక్షిస్తాం. ఆహారంలో పేలుడు పదార్థాలు పెట్టి చంపటం మన దేశం కల్చర్​ కానే కాదు” అని కేంద్రమంత్రి ట్వీట్ చేశారు.

పైనాఫిల్ తిని ఉండకపోవచ్చు

ఏనుగు మృతికి పేలుడు పదార్థాలున్న పైనాఫిల్ తినటమే కారణమని కచ్చితంగా చెప్పలేమని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఏనుగును పొలం దగ్గర చివరి సారిగి చూసిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ గజరాజు పైనాపిల్‌ కాకుండా అడవి పందుల కోసం బెల్లం పూత పూసిన బాంబును తిని ఉండవచ్చని కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. డిటైల్ పోస్ట్ మార్టమ్ రిపోర్ట్​ వస్తే తప్ప దీనిపై క్లారిటీ రాదని వైల్డ్‌ లైఫ్‌ చీఫ్‌ వార్డెన్‌ సురేంద్రన్‌ కుమార్‌‌ అన్నారు. పైనాపిల్‌ తినిందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. పైనాపిలా లేకుంటే బెల్లంపూత తిందా అనే దానిపై విచారణ జరుపుతున్నామన్నారు. కేరళలోని చాలా పొలాల్లో అడవి పందులు రాకుండా రైతులు బాంబులకు బెల్లం పూత పూసి పొలాల్లో పెడతారు. ఒక్కోసారి ఏనుగులు కూడా వాటిని తింటాయని, దాని వల్ల ప్రమాదాలు జరుగుతాయని ఫారెస్ట్‌ అధికారులు చెబుతున్నారు. అలా పెట్టడం కూడా చట్టరీత్యా నేరమని, ఆ దిశగానూ విచారణ జరుపుతున్నారు. చనిపోయిన ఏనుగు 20 రోజుల క్రితమే పేలుడు పదార్థాలతో ఉన్న ఫ్రూట్ గానీ బాంబు గానీ తిని ఉంటుందని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. ఇదే జిల్లాలో నెల క్రితం నోటిలో తీవ్ర గాయాలతో ఓ ఏనుగు చనిపోయింది. అది కూడా పేలుడు పదార్ధాలు నిండిన పండ్లను తిన్నదా అన్నది కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

జనాల్లో తీవ్ర ఆగ్రహాం

గర్భంతో ఉన్న ఏనుగు నీటిలో జల సమాధి కావటం ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది. ఈ సంఘటనపై జనాల్లో ఆగ్రహాం కొనసాగుతోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అమాయక ఏనుగును క్రూరంగా చంపినం ఘటన తనని కలచివేసిందనని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా అన్నారు. మూగజీవాల హత్యను సాటి మనుషుల హత్యగానే పరిగణించాలని పేర్కొన్నారు.

Focusing on 3 suspects, will bring elephant killers to justice, says Kerala CM