ఫోక్ బ్రాండ్ అంబాసిడర్ ‘భన్వరీ దేవి’

ఫోక్ బ్రాండ్ అంబాసిడర్ ‘భన్వరీ దేవి’

రాజస్థాన్‌‌‌‌లోని మెహర్‌‌‌‌గఢ్‌ కోటలోని హాలులో పెద్ద వేదిక పై లండన్‌ నుం చి వచ్చిన విదేశీ అతిధులు ముందు భయం భయంగా కొడుకు కిసన్‌ కుమార్‌‌‌‌ని వెంటబెట్టుకుని వచ్చింది ఒక యాభై రెండేళ్ల భన్వరీ. మెల్లగా గొంతు విప్పింది. ‘తానే ఖట్టే.. తానే ఖట్టే’ అని ఆమె అందుకున్న పాటకు అందరూ ముగ్ధులయ్యారు.ఆమె పాట ఆగిన క్షణం విదేశీ అతిధులతో సహా ఆమెకు ‘ స్టాండింగ్‌ ఓవేషన్‌ ‘ ఇచ్చారు. చప్పట్లతో ఆ ప్రదేశం మారుమోగిం ది. ‘భన్వరీ దేవి’. తొమ్మిది మంది పిల్లల తల్లి. మేకలు కాస్తూ, గుట్టలెక్కుతూ, పుల్లలు పొయ్యిలోకి ఎగదోస్తూ… రొట్టెలు కాలుస్తూ.. ఏడేళ్ల వయసు నుండీ ఆపాటలు పాడుతు౦ది. మొదట భయం భయంగానే నలుగురి ముందు పాడిన భన్వరీ దేవి.ఇపుడు ఫోక్‌ సంచలన గాయని అయింది.’పధారో మారే దేస్‌‌‌‌’, ‘ దేఖే సరోసాత్‌ మాయిరే’ అనే పాటలు విశ్వవ్యాప్తంగా గుర్తింపుపొందాయి. ప్రఖ్యాత దుస్తుల బ్రాండ్ ‘మాన్యవర్‌‌‌‌’ స్త్రీల దుస్తుల బ్రాండ్‌‌‌‌ ‘మోహ’ కలెక్షన్‌ ప్రకటనకు బ్యా క్‌ గ్రౌండ్‌‌‌‌లో భన్వరీ పాటను ఉపయోగించుకుంది. తెలుగులో మంగ్లీ పాడే కొన్ని బతుకమ్మ పాటలు కూడా భన్వరీ ట్యూన్సే . కొన్ని వందల పాటలకు అలవోకగా ట్యూన్లు కట్టే ఆమె పాటల్ని కొందరు రీమిక్స్‌‌‌‌ చేస్తున్నారు . ఇది నచ్చని ఆమె కొడుకు కిసన్‌ ఆమె ట్యూన్లకు పేటెంట్‌‌‌‌ కోరారు. భన్వరీకి  అనవసరంగా వాయిద్యాలు వాడడం నచ్చదు. ఆమెతోపాటు ఎలాంటి మ్యూజిక్‌ లేకుం డా కొడుకు కి సన్‌ వాయించే హార్మోనియంని మాత్రమే ఒప్పుకుంటుంది. లేకపోతే పాట తాలూకు గాంభీర్యం పోతుంది అంటుందామె. ఆమె వీడియోలు.. ఆల్బమ్‌ లు.. భజన్‌ లు.. యూ ట్యూబ్‌ లో చా లా ఫేమస్. అంతర్జా తీయ మీడియా సాంస్కృతిక సంస్థలు ఆమె పాటల కోసం వీడియో రైట్స్‌‌‌‌ కోసం పోటీ పడుతున్నాయి.