ఈ ఏడాది మార్కెట్‌‌‌‌‌‌‌‌లో .. మ్యూచువల్ ఫండ్స్ పెట్టింది రూ.1.3 లక్షల కోట్లు

ఈ ఏడాది మార్కెట్‌‌‌‌‌‌‌‌లో .. మ్యూచువల్ ఫండ్స్ పెట్టింది రూ.1.3 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: దేశంలోని మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌ (ఎంఎఫ్‌‌‌‌‌‌‌‌)  ఈ ఏడాది స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో రూ.1.3 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్‌‌‌‌‌‌‌‌పై ఆసక్తి చూపిస్తుండడంతో ఫండ్స్‌‌‌‌‌‌‌‌ షేర్లలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌  లాంగ్‌‌‌‌‌‌‌‌ టెర్మ్‌‌‌‌‌‌‌‌ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాయని, ఎన్నికలు వంటి షార్ట్ టెర్మ్ ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌ వీటిని ప్రభావితం చేయలేవని ట్రేడ్‌‌‌‌‌‌‌‌జీనీ సీఓఓ త్రివేష్‌‌‌‌‌‌‌‌  డీ  అన్నారు.

 సిప్‌‌‌‌‌‌‌‌లు పెరగడం కలిసొచ్చిందని పేర్కొన్నారు. సెబీ డేటా ప్రకారం, ఈ నెలలోని మొదటి 15 రోజుల్లో నికరంగా రూ.26,038 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. కిందటి నెలలో నికరంగా  రూ.20,155 కోట్లు, మార్చిలో  నికరంగా రూ.44,233 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. ఫిబ్రవరిలో నికరంగా రూ.14,295 కోట్లు, జనవరిలో నికరంగా  రూ.23,010 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి.