
కమల్ హాసన్, శంకర్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భారతీయుడు 2’. ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా విడుదలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. వాస్తవానికి ఈ చిత్రాన్ని జూన్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో మరో నెల వాయిదా వేసి జులైలో విడుదల ఫిక్స్ చేశారు మేకర్స్. జులై 12న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఇక రీసెంట్‌గా ముంబైలోని స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ నెల 22న ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. అలాగే జూన్ 1న చెన్నైలో ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇందులో కమల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. కాజల్, రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్స్.
సిద్ధార్థ్, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, మనోబాల, బ్రహ్మానందం, సముద్రఖని ఇతర పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.